మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 2 ఏప్రియల్ 2020 (15:22 IST)

ఈ దేశం మనకు ఏమిచ్చిందని కాదు.. దేశానికి మనం ఏం చేశామని ప్రశ్నించుకోండి...

భారత మాజీ క్రికెట్, బీజేపీ ఎంపీ గౌతం గంభీర్ ఈ దేశ ప్రజలకు ఓ ప్రశ్న సంధించారు. ఈ దేశం మాకు ఏమిచ్చిందని ప్రజలు అడుగుతుంటారు.. కానీ, ఈ దేశానికి మీరు (మనం) ఏం చేశామని ప్రశ్నించుకోవాలని కోరారు. 
 
ప్రస్తుతం దేశం కరోనా వైరస్ కోరల్లో చిక్కుకుని తల్లడిల్లిపోతోంది. ఈ వైరస్ బారినపడిన వారికి వైద్య బృందాలు అహర్నిశలు సేవలు చేస్తున్నాయి. అలాగే, బాధితులను ఆదుకునేందుకు అనేక మంది తమవంతుగా సాయం చేస్తున్నారు. 
 
ఈ క్రమంలో బీజేపీ ఎంపీగా ఉన్న మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ మరోమారు తనలోని పెద్ద మనస్సును చూపించారు. పీఎం-కేర్స్‌ ఫండ్‌కు తన రెండేళ్ళ విరాళంగా ఇస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. 
 
కాగా, తూర్పు ఢిల్లీ లోక్‌సభ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న గంభీర్ సాయం ప్రకటించడం ఇది రెండోసారి. ఢిల్లీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరోనా వైరస్‌ పేషెంట్లకు చికిత్స అందించే సామగ్రి కోసం తన ఎంపీ ల్యాడ్స్‌ నిధుల నుంచి రూ.50 లక్షలు విడుదల చేశారు.