గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 18 ఏప్రియల్ 2020 (09:54 IST)

ఇండియన్ నేవీలో కలకలం - నావెల్ బేస్ సిబ్బందికి కరోనా పాజిటివ్

భారతీయ నౌకాదళంలో కలకలం రేగింది. ముంబైలోని ఐఎన్ఎస్ అంగ్రే నావెల్ బేస్ సిబ్బందిలో 20 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఐఎన్‌ఎస్‌ అంగ్రే నావెల్‌ బేస్‌లో ఏప్రిల్‌ 7వ తేదీన ఓ సిబ్బందికి కరోనా సోకింది. అతన్ని నుంచి మిగతా వారికి కరోనా వ్యాప్తి చెందినట్లు నేవీ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. 
 
నిజానికి దేశంలో శరవేగంగా వ్యాపిస్తున్న ఈ కరోనా వైరస్... భారత త్రివిధ దళాలకు ఈ వైరస్ వ్యాప్తి చెందలేదు అని భావిస్తున్న తరుణంలో తాజాగా ముంబైలో వెలుగు చూసిన కరోనా పాజిటివ్ కేసులు ఇపుడు కలకలం రేపుతున్నాయి. 
 
నేవీలో కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ఐఎన్‌ఎస్‌ అంగ్రేను లాక్‌డౌన్‌ చేశారు. కరోనా బాధితులందరినీ క్వారంటైన్‌లోకి తరలించారు. మిగతా సిబ్బందికి కూడా కరోనా సోకకుండా ఇండియన్‌ నేవీ చర్యలు తీసుకుంటోంది.