ముంబై, హైదరాబాద్ వాసులు వాటిని తెగ వాడేస్తున్నారట... ఏంటది?
కరోనా కారణంగా లాక్ డౌన్‌తో బయట తిరిగే జనమంతా ప్రస్తుతం ఇంటికే పరిమితమై వుంది. లాక్ డౌన్ ద్వారా నిత్యావసర వస్తువులను ఆన్‌లైన్లో ఆర్డర్ చేస్తున్న సంగతి తెలిసిందే. లాక్‌డౌన్ వల్ల ఏర్పడిన పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని కొన్ని ప్రముఖ యాప్స్ నిత్యావసరాలను కూడా డెలివరీ చేస్తున్నాయి. అలా కిరాణా సామాగ్రి నుంచి ఆహారం వరకు అన్నింటినీ క్షణాల్లో తెచ్చి పట్టే యాప్ 'డుంజో'.
ఇది హైదరాబాద్ కన్నా ముంబై, చెన్నై నగరాల్లో బాగా పాపులర్. డుంజో గత నెలలో జనాలు ఫార్మసీకి సంబంధించి ఏ వస్తువులను ఎక్కువగా ఆర్డర్ చేశారన్న విషయాన్ని వెల్లడించింది. దీని ప్రకారం చెన్నై, జైపూర్ వాసులు హ్యాండ్‌వాష్‌ను ఎక్కువగా ఆర్డర్ చేశారు. తద్వారా కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు శుభ్రతే ప్రధాన అవసరమని గుర్తించినట్లున్నారు. బెంగళూరు, పుణె నగరాల్లో ప్రెగ్నెన్సీ కిట్లను అధికంగా డెలివరీ చేశారు.
అన్నింటికన్నా భిన్నంగా ముంబై వాసులు ఆర్డర్ చేసిన వాటిలో కండోమ్స్ మొదటి స్థానంలో ఉంది. ఇలాంటి విషమ పరిస్థితుల్లోనూ ఇదేం కక్కుర్తి అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఇక హైదరాబాద్ విషయానికొస్తే ఐ-పిల్ అనే గర్భనిరోధక మాత్రలను విచ్చలవిడిగా వాడేశారు. వినడానికి విచిత్రంగా ఉన్నా ఇదే నిజమని డుంజో క్లారిటీ ఇచ్చేసింది.