గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : సోమవారం, 13 ఏప్రియల్ 2020 (22:48 IST)

అంబత్తూరులో ఆంధ్ర డాక్టర్‌ మృతదేహం.. కరోనా సోకడంతో దారుణంగా..?

చెన్నై శివారు ప్రాంతమైన అంబత్తూరులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వైద్యుడి మృతదేహం రోడ్డుపైనే కనుగొన్నారు. అయితే ఆ వైద్యుడు కోవిడ్-19తో చనిపోవడంతో స్థానికులు, పోలీసులు షాకయ్యారు. ఇంకా స్థానికులు నిరసన వ్యక్తం చేయడంతో కరోనాతో మరణించిన వైద్యుడి మృతదేహాన్ని ఆ శ్మశానవాటిక నుండి తొలగించారు. సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకు ఓ అంబులెన్స్ ద్వారా వైద్యుడి మృతదేహాన్ని తీసుకువచ్చి, శ్మశానవాటికలో పడవేసి వెళ్లిపోయిందని స్థానికులు ఆరోపించారు. 
 
కోవిడ్‌తో మరణించిన మృతదేహం చెన్నై, అంబత్తూరు, అయపాక్కం రోడ్డు వద్ద పడేసినట్లు తెలుస్తోంది. అయితే స్థానికుల నిరసన తరువాత అంబత్తూరు శ్మశానవాటిక నుండి ఆ మృతదేహాన్ని తొలగించారు. నగరంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో COVID-19తో మరణించిన ఆ వైద్యుడి మృతదేహాన్ని అంబత్తూరులో పడేశారని వార్తలు వస్తున్నాయి. 
 
వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 56 ఏళ్ల ఆర్థో సర్జన్‌కు నెల్లూరులో జరిగిన పరీక్షలో పాజిటివ్ అని తేలింది. అనంతరం చికిత్స కోసం చెన్నైకి తరలించారు. అయితే ఆ వైద్యుడు కరోనాతో చికిత్స ఫలించక ప్రాణాలు కోల్పోయాడు. ఆ తర్వాత అతడి మృతదేహాన్ని మధ్యాహ్నం 2 గంటలకు అంబులెన్స్ మృతదేహాన్ని తీసుకువచ్చి, శ్మశానవాటికలో పడవేసి వెళ్లిపోయిందని స్థానికులు ఆరోపించారు. 
 
అది చూసి ఆ ప్రాంత వాసులు నిరసన వ్యక్తం చేయడంతో పోలీసులతో పాటు అధికారులు వచ్చి మృతదేహాన్ని తీసుకున్నారు. ఆ మృతదేహానికి డిస్‌ఇన్ఫెక్షన్ చేసి వేరొక ప్రాంతానికి తరలించారు. అయితే ఏ ప్రాంతానికి ఆ మృతదేహాన్ని తరలించారో ఇంకా తెలియరాలేదు. 
 
ఆంబులెన్స్‌లో కరోనా మృతదేహాన్ని తెచ్చిన వారితో ఆస్పత్రి సిబ్బంది కూడా వున్నట్లు తెలిసింది. ఇంకా ఆ సిబ్బంది వ్యక్తిగత రక్షణ కోసం పీపీఈ పరికరాలను కూడా కలిగివున్నారని స్థానికులు తెలిపారు. ఆస్పత్రి సిబ్బంది అలా కరోనా మృతదేహాన్ని శ్మశానవాటికలో పారేయడం చూసి జడుసుకున్నామన్నారు.