సంబంధిత వార్తలు
- ఎట్టకేలకు బోయపాటికి బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా? అయితే ప్రారంభం ఎప్పుడు.?
- బిడ్డ తల్లితో అక్రమ సంబంధం.. పసివాడు అడ్డంగా ఉన్నాడని...
- దగ్గు-గొంతు నొప్పి నివారణకు సహజసిద్ధమైన చిట్కాలు
- రోహిత్ శర్మ అరుదైన రికార్డు.. టీ-20 సిరీస్ నెగ్గిన టీమిండియా
- తెల్ల జెండా చూపించి... మీ సభ్యుల మృతదేహాలు తీసుకెళ్లండి : పాక్కు భారత ఆర్మీ సూచన
బాలుడి ప్రాణం తీసిన నులిపురుగుల మందు
విజయనగరం జిల్లాలో దారుణం జరిగింది. నులిపురుగుల మందు ఓ చిన్నారి ప్రాణంతీసింది. చిన్నారుల కడుపులో ఉండే నులిపురుగులు చావడానికి పోసే మందే.. చివరకు ఆ చిన్నారి ప్రాణమే తీసింది. ఇందుకు కారణమైన ఏఎన్ఎంతో పాటు అంగన్‌వాడీ ఉద్యోగిని వైద్యాధికారులు సస్పెండ్ చేశారు.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లాలోని గరుగుబిల్లి మండలం కొట్నాన రామినాయుడువలస గ్రామంలో గురువారం నులిపురుగుల నివారణ దినోత్సవం నిర్వహించాడు. ఇందులోభాగంగా రామినాయుడువలస గ్రామంలో శిబిరాన్ని ఏర్పాటు చేశాయి.
ఈ శిబిరంలో అంగన్‌వాడీ, ఏఎన్ఎంలు చిననారులకు నులి పురుగుల నివారణ మందులను వేశారు. గ్రామానికి చెందిన రెండేళ్ళ బాలుడు కొట్నాన జశ్విక్ నాయుడును నాన్నమ్మ శిబిరం వద్దకు తీసుకొచ్చింది.
మేము త్వరగా వెళ్లిపోవాలని, మాత్ర ఇవ్వాలని కోరింది. అంగన్‌వాడీ వర్కరు, ఏఎన్ం ఓ మాత్ర తీసి ఆమెకు ఇచ్చారు. బాలుడికి సగం ముక్క వేయాలని సూచించారు.
వారు చెప్పినట్టుగానే మాత్రను రెండు ముక్కలు చేసి ఒక భాగాన్ని బాలుడికి వేసింది. మాత్ర మింగించిన కొన్ని క్షణాల్లోనే కుప్పకూలిపోయాడు. దీంతో బాలుడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఆ బాలుడిని పరీక్షించిన వైద్యులు.. అప్పటికే చనిపోయినట్టు నిర్ధారించారు.
