శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : బుధవారం, 28 నవంబరు 2018 (12:30 IST)

మూడో తరగతి చదువుతున్న బాలికపై అత్యాచారం.. అర్థరాత్రి నడిరోడ్డుపై?

వయోబేధం లేకుండా మహిళలపై దాడులు జరుగుతున్నాయి. అత్యాచారాలు పెచ్చరిల్లిపోతున్నాయి. ముఖ్యంగా చిన్నారులపై అఘాయిత్యాలు అమాంతం పెరిగిపోతున్నాయి. తాజాగా విజయనగరంలో దారుణం చోటుచేసుకుంది. మూడో తరగతి చదివే బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ కామాంధుడు.
 
వివరాల్లోకి వెళితే.. శృంగవరపు కోట మండలం బొడ్డవరకు చెందిన ఓ బాలిక మూడో తరగతి చదువుతోంది. ఆమెను అపహరించిన దుండగుడు చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆపై ఐతన్న పాలెం వద్ద రోడ్డుపై అర్థరాత్రి వదిలిపెట్టి పారిపోయాడు.
 
తెల్లవారుజామున అటుగా వెళ్ళిన స్థానికులు తీవ్రస్రావంతో కనిపించిన చిన్నారిని గమనించి ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.