గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 25 నవంబరు 2018 (16:06 IST)

ప్రేమతో పరువు పోతుందని.. ఆ ఇద్దరి ఆత్మహత్య

పరువు కోసం హత్యలు పెచ్చరిల్లిపోతున్న నేపథ్యంలో.. ఒకే గ్రామానికి చెందిన యువతీయువకులు ప్రేమించిన పాపానికి కొడుకు తండ్రితో పాటు అమ్మాయి తరపున ఆమె సోదరుడు ఆత్మహత్య పాల్పడిన ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. సంగారెడ్డి, ఝరాసంగం మండలం, మేదపల్లికి చెందిన ఓ యువకుడు అదే గ్రామానికి చెందిన అమ్మాయిని ప్రేమించాడు. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పాడు. 
 
కానీ పెద్దలు కుమారుడి పెళ్లికి అంగీకరించలేదు. ఇంతలోనే అమ్మాయి తరపు బంధువులు కూడా పెళ్లి సంబంధాలు చూడటం మొదలెట్టారు. యువతి కూడా తాను ప్రేమ వివాహమే చేసుకుంటానని తెగేసి చెప్పడంతో .. ఆమె సోదరుడు విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అలాగే కొడుకు ప్రేమ వ్యవహారంతో పరువు పోయిందని భావించిన తండ్రి కూడా పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు.