శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. రాబోయే చిత్రాలు
Written By శ్రీ
Last Modified: బుధవారం, 21 నవంబరు 2018 (16:31 IST)

ర‌జ‌నీకాంత్ 2.0 నిడివి ఎంతో తెలుసా..?

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ - గ్రేట్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్లో రూపొందిన సంచ‌ల‌న చిత్రం 2.0. భార‌త‌దేశంలోనే అత్య‌ధిక బ‌డ్జెట్ చిత్రంగా రూపొందిన ఈ చిత్రం ఎప్పుడో రిలీజ్ కావాలి. ఎట్ట‌కేల‌కు ఈ నెల 29న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అయ్యింది. బాలీవుడ్ స్టార్ హీరో అక్ష‌య్ కుమార్ విల‌న్ పాత్ర పోషించ‌డం విశేషం. ఇటీవ‌ల రిలీజ్ చేసిన ట్రైల‌ర్‌కు అనూహ్య‌మైన స్పంద‌న ల‌భించింది. దీంతో ఈ సినిమాపై మ‌రింత క్రేజ్ ఏర్ప‌డింది. 
 
తెలుగు రాష్ట్రాల్లోనే సుమారు 1200 స్క్రీన్లలో తమిళనాడులో 750 స్క్రీన్లు, కర్ణాటకలో 700 స్క్రీన్లు, కేరళలో 500 స్క్రీన్లు రోబో 2.0 ప్ర‌ద‌ర్శించ‌నున్న‌ట్టు స‌మాచారం. బాలీవుడ్‌లో కూడా భారీ విడుదల జరుగుతోంది. ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే.. 2.0 నిడివి రెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలు. సుమారు 500 కోట్ల‌తో ఈ సినిమా రూపొందింది. మ‌రి.. ప్ర‌పంచ వ్యాప్తంగా ఎంత క‌లెక్ట్ చేస్తుందో..? ఎలాంటి సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుందో చూడాలి.