1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. vizag rural tahsildar suspended

రూ.వంద కోట్ల భూస్కామ్‌కు పాల్పడిన తహశీల్దారు... ఎక్కడ?

విశాఖపట్టణం రూరల్ తహశీల్దారు మజ్జి శంకర రావు ఏకంగా వంద కోట్ల రూపాయల భూకుంభకోణానికి పాల్పడ్డాడు. దీంతో అతన్ని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. రుషికొండలో ప్రభుత్వ భూములకు సంబంధించిన వివరాలను రికార్డుల్లో త

vizag rural
విశాఖపట్టణం రూరల్ తహశీల్దారు మజ్జి శంకర రావు ఏకంగా వంద కోట్ల రూపాయల భూకుంభకోణానికి పాల్పడ్డాడు. దీంతో అతన్ని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. రుషికొండలో ప్రభుత్వ భూములకు సంబంధించిన వివరాలను రికార్డుల్లో తప్పుగా నమోదుచేసిన విషయాన్ని గత ఏడాది డిసెంబరులో వెలుగులోకి వచ్చింది. 
 
దీనిపై కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ స్పందించి విచారణ చేయించారు. రికార్డులను ఉద్దేశపూర్వకంగా ఎర్ర ఇంకుతో దిద్దేసినట్లు తేలడంతో డిప్యూటీ తహసీల్దార్‌ శ్యామ్‌ప్రసాద్‌, వీఆర్‌ఏ బి.అప్పారావులను గత నెల 4నే సస్పెండ్‌ చేశారు. బాధ్యతారహితంగా వ్యవహరించి రూ.100 కోట్ల భూస్కామ్‌కు పాల్పడినందుకు తహసీల్దార్‌ శంకరరావును సీసీఎల్‌ఏ సస్పెండ్‌ చేసింది. ఉత్తర్వులను గురువారం అందజేసినట్లు కలెక్టర్‌ తెలిపారు. 
About Writer
pnr
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
ఇష్టం లేని పెళ్లి.. పదినెలల పాటు కాపురం చేసింది... ఆపై ఉరేసుకుని ఆత్మహత్య