1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Nirmal district crime news

ఇష్టం లేని పెళ్లి.. పదినెలల పాటు కాపురం చేసింది... ఆపై ఉరేసుకుని ఆత్మహత్య

ఇష్టంలేని పెళ్లి చేశారని మనస్తాపం చెందిన ఓ యువతి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన నిర్మల్‌ జిల్లా సోన్‌ మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మండలంలోని న్యూవెల్మల్‌ గ్రామానికి చెందిన గారి ర

Nirmal district crime news
ఇష్టంలేని పెళ్లి చేశారని మనస్తాపం చెందిన ఓ యువతి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన నిర్మల్‌ జిల్లా సోన్‌ మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మండలంలోని న్యూవెల్మల్‌ గ్రామానికి చెందిన గారి రుచిత (25) ఆలియాస్‌ లిఖిత గురువారం తన సొంతిట్లో బలవన్మరణానికి పాల్పడింది.

పది నెలల క్రితం రుచితకు సాయికృష్ణతో వివాహమైంది. రుచిత పిజియోథెరపిస్టుగా విధులు నిర్వహిస్తుండగా, భర్త కృష్ణ వ్యవసాయం చేస్తున్నాడు. ఈ సంఘటనతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. 
 
ఇదిలా ఉంటే.. దంపతుల ఆత్మహత్యాయత్నం మంచిర్యాలలో కలకలం రేపింది. స్ధానిక శ్రీ శ్రీ నగర్‌లో నివాసముండే దుర్గయ్య, లక్ష్మి దంపతులు ఆత్మహత్యా యత్నం చేశారు. స్థానికులు గమనించి వెంటనే వారిద్దరినీ హాస్పిటల్‌కు తరలించారు. కాగా చికిత్స పొందుతూ దుర్గయ్య మృతి చెందగా, లక్ష్మి పరిస్థితి విషమంగా ఉంది. ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. 
తర్వాతి కథనం
ఏపీ అసెంబ్లీ నిర్మాణంలో ఎన్నెన్ని ప్రత్యేకతలో.. మైకు విరగ్గొట్టలేరు... పోడియం ఎక్కలేరు