1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. We have another nuclear missile

మనకు మరో అణు క్షిపణి

nuclear missile
భారత అమ్ములపొదిలో మరో అణు క్షిపణి చేరింది. రెండు వరుస వైఫల్యాల తరువాత ఎట్టకేలకు కే4 బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం విజయవంతమైంది. విశాఖపట్నం నుంచి 30 నాటికల్ మైళ్ల దూరంలో సముద్రంలో ఏర్పాటు చేసిన లక్ష్యాన్ని అత్యంత కచ్చితత్వంతో ఈ క్షిపణి ఛేదించింది.

ఆదివారం నిర్వహించిన ఈ ప్రయోగం విజయవంతమైందని, అణు జలాంతర్గామి నుంచి 3500 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఈ క్షిపణి ఛేదించగలదని డీఆర్డీవో తెలిపింది. ఈ బాలిస్టిక్ క్షిపణిని ఐఎన్‌ఎస్‌ అరిహంత్‌లో అమర్చేలా అభివృద్ధి చేశామని, 17 టన్నుల బరువుండే ఈ క్షిపణి రెండు టన్నుల వార్‌హెడ్‌ను మోసుకుపోగలదని డీఆర్డీవో తెలిపింది.

ఇదిలా ఉంటే 2019 నవంబర్‌లోనే ఈ క్షిపణి ప్రయోగం జరగాల్సిఉంది. కానీ అప్పట్లో బంగాళాఖాతంలో బుల్‌బుల్‌ తుపాన్‌ తీవ్రంగా ఉండడంతో ప్రయోగం వాయిదా పడింది. అయితే ఆదివారం నిర్వహించిన ప్రయోగం విజయవంతం కావడంతో సముద్రతలం నుంచి అణు క్షిపణులను ప్రయోగించగల ఆరో దేశంగా భారత్ అవతరించింది.

ఈ క్షిపణిని అణు జలాంతర్గాముల్లో అమర్చి సైన్యం చేతికి అందించేలోపు మరికొన్నిసార్లు ప్రయోగాలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు డీఆర్డీవో తెలిపింది. డీఆర్డీవో అధికారులకు ఏపీ సీఎం జగన్ శుభాకాంక్షలు తెలిపారు.
తర్వాతి కథనం
కేరళ ముస్లిం దర్గాల్లో హిందూ వివాహం.. మతసామరస్యానికి ఇదే నిదర్శనం