భర్తను రోకలి బండతో కొట్టి చంపిన భార్య..ఎక్కడ.?

crime photo
మోహన్| Last Updated: శుక్రవారం, 30 ఆగస్టు 2019 (18:47 IST)
కర్నూలు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. వేధింపులను తట్టుకోలేని ఓ అతడిని కడతేర్చింది. రోకలి బండతో మోది చంపేసింది. హత్య చేసిన తర్వాత ఆమె స్వయంగా పోలీసుల ఎదుట లొంగిపోయింది. భర్త పెడుతున్న హింసలను తట్టుకోలేకనే హత్య చేసినట్లు సదరు మహిళ అంగీకరించింది.

కర్నూలు జిల్లాలోని గోస్పాడు మండలం యాళ్ళూరు గ్రామంలో రేష్మ, షేక్ మహబూబ్ అనే భార్యాభర్తలు నివాసం ఉంటున్నారు. వీరిద్దరికీ 11 సంవత్సరాల క్రితం వివాహం అయింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఒకరికి 7 సంవత్సరాల వయస్సు మరొకరికి 3 సంవత్సరాల వయస్సు. ఈ క్రమంలో భర్త షేక్ మహబూబ్ గత కొన్నేళ్లగా భార్య రేష్మను వేధింపులకు గురిచేస్తున్నాడు. ప్రతి రోజూ మద్యం తాగి వచ్చి ఆమెను చిత్రహింసలకు గురిచేస్తున్నాడు.

భర్త వేధింపులను తాళలేక భార్య శుక్రవారం (ఆగస్టు30, 2019) ఉదయం రోకలి బండతో కొట్టింది. అతను తీవ్ర గాయాలు కావడంతో చనిపోయాడు. హత్య చేసిన రేష్మ ఆ తర్వాత పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయింది. తానే హత్య చేసినట్లు భార్య రేష్మ స్వయంగా పోలీసులకు తెలియజేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని, విచారణ ప్రారంభించారు.

తాగుడుకు బానిసగా మారి భార్యను హింసించడం వల్లే ఆమె ఈ దారుణానికి పాల్పడిందని చుట్టుప్రక్కల వారు అంటున్నారు. పిల్లలు అనాథలుగా మారారని వారు వాపోతున్నారు. ఏది ఏమైనా తాగుడు వల్ల కుటుంబాలు నాశనం అవుతున్నాయి అని చెప్పడానికి ఈ ఘటనే ఉదాహరణ.దీనిపై మరింత చదవండి :