ప్రేమజంటపై దాడి.. యువతిపై అత్యాచారం... హత్య.. ఎక్కడో తెలుసా?

gang rape
Last Updated: సోమవారం, 25 ఫిబ్రవరి 2019 (08:56 IST)
ఏపీలో మహిళలపై దారుణాలు పెచ్చరిల్లిపోతున్నాయి. మొన్నటికి మొన్న జ్యోతి ఘటన మరవక ముందే.. పశ్చిమ గోదావరిలో ఓ యువతిపై దారుణం చోటుచేసుకుంది. ఆదివారం తన ప్రేమికుడితో అలా బయటికి వెళ్లిన యువతిపై అత్యాచారంతో పాటు హత్య జరిగింది. 
 
ప్రేమ జంటపై గుర్తు తెలియని దుండగులు దాడి చేసి.. యువకుడిని తీవ్రంగా గాయపరిచారు. ఆపై యువతిని బలవంతంగా లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో యువతి ప్రాణాలు కోల్పోగా... యువకుడు తీవ్ర గాయాలకు గురయ్యాడు. పశ్చిమ గోదావరి, కామవరపు కోచ మండలం, జీలకర్రగూడెంలోని బౌద్ధరామాల వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. బౌద్ధరామాల సందర్శనకు వెళ్లిన ప్రేమ జంటపైనే ఈ దారుణం చోటుచేసుకుంది. 
 
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధిత యువకుడిని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. యువతిపై అత్యాచారం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. బాధితులు భీమడోలు మండలం అజ్జవారి గూడెం వారిగా పోలీసులు గుర్తించారు.
 
బౌద్ధారామాలు అటవీప్రాంతంలో ఉండడం, జనసంచారం తక్కువగా ఉండడం వల్లే దాడి జరిగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. జనసంచారం లేని ప్రాంతాలకు ప్రేమికులు అలా పర్యటనకు వెళ్లడం సురక్షితం కాదని.. పోలీసులు చెప్తున్నారు. నిందితుల కోసం గాలిస్తున్నామని... వారు చెప్పారు.దీనిపై మరింత చదవండి :