శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 24 ఫిబ్రవరి 2019 (17:55 IST)

పశ్చిమ బెంగాల్.. కూతురితో తిరుగుతున్నాడని పెట్రోల్ పోసి?

పశ్చిమ బెంగాల్‌లో పరువు హత్య చోటుచేసుకుంది. తమ కుమార్తెను ప్రేమించిన యువకుడిని తల్లిదండ్రులు సజీవదహనం చేశారు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్‌లోని మిడ్నాపూర్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రంజిత్ మొండల్(21) మిడ్నాపూర్‌లో స్వర్ణకారుడిగా పనిచేస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన యువతితో ప్రేమలో పడ్డాడు. 
 
ఇది తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు రంజిత్‌కు వార్నింగ్ ఇచ్చారు. కానీ  గత శుక్రవారం యువతిని కలిసేందుకు రంజిత్ వెళ్లగా, అమ్మాయి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు అతడిని పట్టుకుని తీవ్రంగా కొట్టారు. అయినా కసి తీరకపోవడంతో ఊరిబయటకు తీసుకెళ్లి పెట్రోల్ పోసి తగులబెట్టారు. 
 
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. రంజిత్ మొబైల్ ఫోన్ ఆధారంగా విచారణ ప్రారంభించిన పోలీసులు అమ్మాయి కుటుంబ సభ్యులే నిందితులని తేల్చారు.