శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 24 ఫిబ్రవరి 2019 (14:50 IST)

యువతిని కిడ్నాప్ చేసి.. గదిలో బంధించి.. ఐదుగురు..?

ఉత్తరప్రదేశ్‌లో మహిళలపై అత్యాచారాలు పెచ్చరిల్లిపోతున్నాయి. చిన్నారులపై కూడా సామూహిక అత్యాచారాలకు పాల్పడిన సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా యువతిపై గ్యాంగ్ రేప్ చోటుచేసుకుంది. యూపీలో ముజఫర్‌నగర్ నగర్ జిల్లాలో ఈ దారుణం సంభవించింది. 
 
23 ఏళ్ల యువతిపై ఐదుగురు యువకులు అత్యంత దారుణంగా గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. 23 ఏళ్ల యువతిని కిడ్నాప్ చేసిన అదే గ్రామానికి చెందిన ఐదుగురు యువకులు.. ఓ గదిలో బంధించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. 
 
యువతి స్పృహ తప్పిపడిపోయిన తర్వాత ఆమెను అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. షాక్ నుంచి తేరుకున్న ఆమె... పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు... యువతిని మెడికల్ పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.