బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 24 ఫిబ్రవరి 2019 (14:38 IST)

కవలలను డబ్బుకోసం అలా చంపేశారు.. చేతులు కాళ్లూ కట్టేసి?

ఇటీవల సంచలనం సృష్టించిన కవల సోదరుల కిడ్నాప్ కథ దుఃఖాంతమైంది. ఉత్తరప్రదేశ్ చిత్రకూట్‌లో యమునా నదికి ఒడ్డున ఈ ఇద్దరు పిల్లల శవాలు తేలాయి. కిడ్నాపర్లు వీరిని మధ్యప్రదేశ్‌ వైపు ఉన్న చిత్రకూట్‌లో ఈనెల 12న అపహరించుకు వెళ్లి ఆ తర్వాత కాళ్లూ చేతూలు కట్టేసి సజీవంగా నీళ్లల్లోకి విసిరేసినట్టు పోలీసులు వెల్లడించారు. 
 
కిడ్నాపర్లు పిల్లలను కిడ్నాప్ చేసి వారి తల్లిదండ్రుల వద్ద భారీ మొత్తాన్ని డిమాండ్ చేశారు. అయితే పిల్లల్ని విడిచిపెట్టాలంటూ వారి తల్లిదండ్రులు కిడ్నాపర్లకు 20 లక్షల రూపాయలు ఈనెల 19న ఇచ్చారని, అయితే కోటి రూపాయలు ఇవ్వాలంటూ కిడ్నాపర్లు డిమాండ్ చేసి, 21వ తేదీన చంపేశారని పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో ఆరుగురిని అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు.