శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 24 ఫిబ్రవరి 2019 (08:54 IST)

అసోంలో కల్తీ మద్యం కాటు: 110 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి..

అసోంలో కల్తీ మద్యం కాటుకు 110 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం వుందని అధికారులు వెల్లడించారు. కల్తీమద్యం కాటుకు ఏకంగా 110 మంది తేయాకు కార్మికుల ప్రాణాలు ప్రతి పది నిమిషాలకు ఒకరిగా గాలిలో కలిసిపోతూ వున్నాయి. శనివారం సాయంత్రానికి  మృతుల సంఖ్య  110కి చేరుకుంది. మరో 341 మంది వివిధ ఆసుపత్రుల్లో మృత్యువుతో పోరాడుతున్నారు. 
 
కల్తీ మద్యం తాగిన తేయాకు కూలీలందరూ గురువారం సాయంత్రం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని వివిధ ఆసుపత్రులకు తరలించారు. ఘటనపై ముఖ్యమంత్రి శర్బానంద సోనోవాల్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున, అస్వస్థతకు గురైన వారికి రూ. 50 వేల చొప్పున నష్ట పరిహారం ప్రకటించారు. ఇప్పటివరకు 50 లీటర్ల కల్తీ సారాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.