శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 22 ఫిబ్రవరి 2019 (11:04 IST)

కంటిలో పొడవాటి పురుగు.. ఆపరేషన్ తీసి వెలికి తీశారు.. ఎక్కడ?

కంటిలో నలుసు పడితేనే తట్టుకోలేం. అలాంటి పొడవాటి పురుగు చేరితే ఇంకేమైనా వుందా.. అలాంటి ఘటనే విశాఖలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. విశాఖ నగర పరిధిలోని పెందుర్తికి చెందిన బి.భారతి గత కొంతకాలంగా తీవ్రమైన కంటి నొప్పితో బాధపడుతోంది. స్థానికంగా ఉన్న వైద్యులకు చూపించగా వారు మందులు రాసిచ్చారు. 
 
ఎన్ని మందులు వాడుతున్నా తాత్కాలిక ఉపశమనం తప్ప సమస్య తీరక పోవడంతో శంకర్‌ ఫౌండేషన్‌ వైద్యశాలకు వెళ్లింది. అక్కడ ఆమె కంటిని పరిశోధించిన వైద్యులు ఆమె కంటిలో పురుగు వున్నట్లు గుర్తించారు. ఆపై ఆపరేషన్‌ అవసరమని వైద్యులు తెలిపారు. ఆపరేషన్‌ చేసి ఆమె కంటిలో ఉన్న 15 సెంటిమీటర్ల పొడవైన నులిపురుగును వెలికితీశారు. 
 
ఇన్నాళ్ల పాటు కంటిలో వుండిపోయిన ఆ పొడవాటి నులిపురుగును చూసి వైద్యులు షాకయ్యారు. శస్త్రచికిత్స అనంతరం కంటి నొప్పి నుంచి ఉపశమనం లభించడంతో భారతి వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇన్నాళ్లు కంటి నొప్పితో తాను పడిన ఇబ్బంది అంతా ఇంతా కాదని వాపోయింది. వైద్యులు ఆ నొప్పి నుంచి తనను కాపాడారని చెప్పింది.