మహిళ ముఖంపై పిడిగుద్దులు... కడుపులో తన్నులు... లిఫ్టులో దొంగ పైశాచికం

attack
సందీప్| Last Updated: గురువారం, 21 ఫిబ్రవరి 2019 (18:22 IST)
చిన్న పర్సును దొంగతనం చేయడం కోసం లిఫ్ట్‌లో ఓ మహిళను చితకబాదాడు ఓ దొంగ. ఫిబ్రవరీ 14 వాలంటైన్స్ డే రోజు మలేషియాలో జరిగిన ఈ ఘటన సీసీ టీవీలో రికార్డ్ అయింది. ఆ వీడియో కొద్ది రోజులుగా సామాజిక మాధ్యమంలో వైరల్ అయింది. లక్షల కొద్దీ వ్యూస్‌ను రాబట్టింది. ఓ పర్సు తగిలించుకుని లిఫ్ట్‌లో ఎక్కుతుండగా చూశాడు. సామాన్యుడి లాగా అతను కూడా లిఫ్ట్‌లో ఎక్కాడు. లిఫ్ట్ తలుపులు మూసుకోగానే ఆమెపై ఉన్నట్టుండి దాడికి దిగాడు.

అమె తగిలించుకున్న బ్యాగును లాక్కోవడానికి ప్రయత్నించాడు. ఆమె ప్రతిఘటించాలని చూసినా పిడిగుద్దులతో ఆమెపై దాడి చేశాడు. కడుపులో తన్నుతూ, తీవ్రంగా కొట్టాడు. లిఫ్ట్ డోర్ తెరుచుకోగానే ఏమీ ఎరుగనట్లు నిల్చున్నాడు. డోర్ మూసుకోగానే మళ్లీ దాడికి దిగాడు. చివరిగా తాను అనుకున్న పనిని ముగించుకుని పారిపోయాడు.

ఈ సీన్ అంతా సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. తీవ్ర గాయాలైన ఆమె ఆసుపత్రిలో చేరింది. పర్సులో ఏటియం కార్డ్, ఐడి కార్డు, 400 రిగ్గిట్స్ నగదు ఉన్నట్లు తెలిపింది. చోరుడిని పట్టించిన వారికి లేదా అతని సమాచారాన్ని తెలిపిన వారికి 10 వేల మలేసియన్ రిగ్గిట్స్ (లక్షా 75 వేల రూపాయలు) బహుమానంగా ఇస్తామని మలేషియన్ పోలీసులు ప్రకటించారు.దీనిపై మరింత చదవండి :