గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : గురువారం, 21 ఫిబ్రవరి 2019 (12:33 IST)

హైదరాబాద్‌లో విద్యార్థులకు మత్తుమందు విక్రయం... ఫారిన్ ఉమెన్ నుంచి భారీగా..

హైదరాబాద్ మహానగరంలో డ్రగ్స్ కలకలం మరోమారు చెలరేగింది. విద్యార్థులకు భారీగా మత్తుపదార్థాలను విక్రయిస్తున్న ఓ విదేశీ మహిళను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, నిజానికి హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ విక్రయాల అడ్డుకట్టకు నగర పోలీసులు ఎన్నో రకాలైన చర్యలను తీసుకుంటుంది. కానీ, డ్రగ్స్ దందా మాత్రం గుట్టుచప్పుడు కాకుండా సాగిపోతోంది. పోలీసుల కళ్లుగప్పి మాదకద్రవ్యాలను నగరంలోకి యధేచ్చగా తరలిస్తున్నారు. 
 
ఈ మత్తుపదార్థాలను కాలేజీ విద్యార్థులకు సరఫరా చేస్తున్నారు. ముఖ్యంగా సంపన్నుల పిల్లలను కూడా టార్గెట్ చేస్తున్నారు. వారిని మాదకద్రవ్యాలకు బానిసలు చేసి రెండు చేతులా అర్జిస్తున్నారు. 
 
ప్రధానంగా బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్, గచ్చిబౌలి ప్రాంతాల్లోని వ్యాపారవేత్తల పిల్లలు డ్రగ్స్‌ బానిసలుగా మారినట్టు పోలీసులు గుర్తించారు. గతంలో అనేకమంది డ్రగ్స్ ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. కఠిన చర్యలు తీసుకుంటున్నా, నిఘాను పెంచినా డ్రగ్స్ ముఠాలు మాత్రం రెచ్చిపోతూనే ఉన్నాయి
 
తాజాగా హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం చెలరేగింది. స్టూడెంట్స్‌ని టార్గెట్‌గా చేసుకుని డ్రగ్స్ దందా చేస్తున్న ఓ విదేశీ మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ మహిళను ఘనా దేశస్తురాలిగా గుర్తించారు. ఆమె నుంచి 50గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.