దశాబ్దాల నిషేధాన్ని బద్ధలు కొట్టిన మహిళ.. అగస్త్యకూడంపై పాదం

Agasthyakoodam,
Last Updated: గురువారం, 21 ఫిబ్రవరి 2019 (17:07 IST)
సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఆదర్శంగా తీసుకుని శబరిమల పుణ్యక్షేత్రంలోకి మహిళలు అడుగుపెట్టారు. ఈ వివాదం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. ఇప్పటికీ ఇది సద్దుమణిగలేదు. ఇంతలోనే మరో వివాదం తెరపైకి వచ్చింది. కేరళలో స్త్రీలకు ప్రవేశం లేని మరో పుణ్యక్షేత్రం అగస్త్యకూడం. దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ నిషేధాన్ని బద్దలు కొడుతూ ఓ మహిళ అగస్త్యకూడంపై కాలు మోపింది.

అగస్త్యకూడం కొండపైకి మహిళల ప్రవేశంపై ఉన్న అనధికారిక నిషేధాన్ని ఎత్తివేస్తూ గత నవంబరు నెలలో హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ క్రమంలో ఆర్మీ అధికార ప్రతినిధి అయిన ధన్య సనాల్ ఈనెల 18వ తేదీ సోమవారం పురుషులతోపాటుగా ట్రెక్కింగ్‌కు వెళ్లారు. కోర్టు తీర్పు అనంతరం తొలిసారిగా
ట్రెక్కింగ్‌ను రాష్ట్ర అటవీ శాఖ సోమవారం ప్రారంభించిన రాష్ట్ర అటవీశాఖ మార్చి 1 వరకు దీన్ని కొనసాగించనుంది. 1,868 మీటర్ల ఎత్తయిన ఈ కొండపైకి తొలి బ్యాచ్‌లో 100 మందిని ట్రెక్కింగ్‌కు అనుమతించగా.. అందులో ధన్య ఒక్కరే మహిళ కావటం విశేషం.

ఈ క్రమంలో కొండపైకి మహిళల ప్రవేశంపై స్థానిక కణి తెగ ప్రజలు నిరసన తెలుపుతున్నారు. మా విశ్వాసాలు, ఆచారాలకు మండగలుపుతున్నారని మండిపడుతున్నారు. మాకులదైవం అయిన అగస్త్యముని అవమానించినట్లేనంటు కొండపైకి వెళ్లే ప్రవేశ మార్గం బోనకాడ్ వద్ద జానపద పాటలతో గిరిజనులు నిరసన తెలిపారు. కొండను అధిరోహించిన ధన్యా మాట్లాడుతూ అధికారికంగా ఈ కొండను ఎక్కిన తొలి మహిళను తానేననన్నారు. ప్రకృతిని అందరూ ప్రేమిస్తారు. మరి
అలాంటప్పుడు లింగ వివక్ష ఎందుకని ఆమె ప్రశ్నించారు. భవిష్యత్తులో మరింత మంది మహిళలు ట్రెక్కింగ్‌ వస్తారని తాను ఆశిస్తున్నానన్నారు.దీనిపై మరింత చదవండి :