గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : బుధవారం, 20 ఫిబ్రవరి 2019 (14:16 IST)

పడక సుఖానికి అడ్డుగా ఉన్నారనీ.. ఇద్దరు పిల్లల్ని చంపిన కసాయి తల్లి...

పరాయి వ్యక్తితో పడకసుఖం పంచుకునేందుకు ఓ తల్లి కిరాతక చర్యకు పాల్పడింది. తన ఇద్దరు పిల్లలను గొంతు నులిమి హత్య చేసింది. ఆ తర్వాత అనారోగ్యంతో చనిపోయినట్టుగా ఇరుగుపొరుగువారిని నమ్మించే ప్రయత్నం చేసింది. ఈ దారుణం కృష్ణా జిల్లాలో జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లాలోని పెడన 15వ వార్డుకు చెందిన ఓ వివాహిత అదే ప్రాంతానికి చెందిన మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. భర్త ఇంట్లో లేని సమయంలో ప్రియుడుని ఇంటికి పిలిపించి శృంగారంలో పాల్గొంటూ వచ్చింది. 
 
అయితే, ఈమెకు ప్రశాంతి (5), దివ్య (3) అనే ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు. ప్రియుడు ఇంటికి వచ్చిన సమయంలో ఆతనితో ఏకాంతంగా గడిపేందుకు ఇద్దరు పిల్లలు అడ్డుగా ఉండేవారు. దీంతో ఇద్దరు పిల్లలను రెండు రోజుల వ్యవధిలో హత్య చేసి, అనారోగ్యంతో చనిపోయినట్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. 
 
ఇద్దరు పిల్లలు రెండు రోజుల వ్యవధిలో చనిపోవడంతో అనుమానించిన బంధువులు ఆ మహిళపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే కేసు నమోదు చేసిన పోలీసులు... ఆ మహిళను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెల్లడైంది. గతంలో తన భర్తను కూడా ఇలాగే చంపిందని బంధువులు ఆరోపిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.