మంగళవారం, 28 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By కుమార్
Last Updated : బుధవారం, 20 ఫిబ్రవరి 2019 (12:46 IST)

చనువుగా మెలిగి శీలాన్ని దోచుకున్నాడు.. తర్వాత వీడియో తీసి...

ఒక భారతీయ యువకుడు దుబాయ్‌లోని ఓ కంపెనీలో సేల్స్‌మేన్‌గా పని చేస్తున్నాడు. అతను దుబాయ్‌కు చెందిన ఒక మహిళతో సోషల్ మీడియా ద్వారా పరిచయం పెంచుకుని, తనను తాను ఫ్రెంచ్ జాతీయుడిగా చెప్పుకున్నాడు. కొంత కాలానికి వీరి మధ్య స్నేహం బలపడి వారి మధ్య చనువు కూడా బాగా ఎక్కువైంది.
 
అయితే ఆమెకు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పిన అతని మాటలు నమ్మి వెళ్లిన ఆమెను అప్పటికే వారి మధ్య ఉన్న చనువు వల్ల ఆమెను లోబరచుకున్నాడు. ఈ విధంగా వాళ్లిద్దరూ చాలా సార్లు ఏకాంతంగా కలుసుకున్నారు. అయితే వారు కలుసుకున్న చాలా సార్లు అతను ఆమెకు తెలియకుండా వీడియోలు రికార్డ్ చేసాడు.
 
కొంతకాలంగా అతనికి దూరంగా ఉంటూ వస్తున్న ఆ యువతికి ఆ వ్యక్తి ఫోన్ చేసి వీడియోలు రికార్డింగ్ చేసిన విషయం చెప్పి, ఆమెను బెదిరించడం ప్రారంభించాడు. అతను చెప్పినట్లు వినకుంటే ఆ వీడియోలను ఇంటర్నెట్‌లో ఉంచుతానని బెదిరించడంతో ఏమి చేయాలో తోచని ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
అతను తనను లైంగికంగా వేధించి డబ్బులు డిమాండ్ చేయడమే కాకుండా తాను నగ్నంగా స్నానం చేస్తూ తీసుకున్న వీడియోను అతని ఫోన్‌కు పంపుకుని దాన్ని బయటపెడతానని బెదిరిస్తున్నాడని ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆ వ్యక్తి గురించిన వివరాలను సేకరించారు. ప్రస్తుతం ఆ యువకుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.