మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ప్రీతి చిచ్చిలి
Last Updated : మంగళవారం, 19 ఫిబ్రవరి 2019 (17:30 IST)

విలన్‌గా నేచురల్ స్టార్.. మరి హీరో ఎవరో తెలుసా..?

సినిమా కథలలో, ప్రేక్షకుల అభిరుచులలో చాలా మార్పు వచ్చింది. హీరో, హీరోయిన్, నాలుగు ఫైట్లు, ఆరు పాటల ఫార్ములా ఇప్పుడు అస్సలు పని చేయడం లేదు. వైవిధ్యభరితమైనవి చిన్న సినిమాలు అయినప్పటికీ భారీ విజయం స్వంతం చేసుకుంటున్నాయి. హీరోలతో సంబంధం లేకుండా కథాబలం బాగుండే సినిమాలను మాత్రమే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. 
 
దీంతో దర్శకులు, హీరోలు కూడా సినిమాల ఎంపిక విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. విభిన్న రకాల పాత్రలను ఎంపిక చేసుకుంటూ, తన సహజమైన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తూ భారీ విజయాలతో పాటుగా నేచురల్ స్టార్ అనే టైటిల్‌ను దక్కించుకున్నాడు మన నాని.
 
ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకుడిగా తెరకెక్కుతున్న సినిమాలో విలన్‌గా కనిపించబోతున్నాడట నాని. మరి హీరో ఎవరనుకుంటున్నారా, సుధీర్ బాబు, సుధీర్ ఇందులో పోలీసుగా కనిపించనున్నాడట. దిల్ రాజు నిర్మాతగా ఈ సినిమా త్వరలో సెట్స్ పైకి రానుంది. హీరోగా మెప్పించిన నాని విలన్‌గా భయపెట్టగలడో లేదో చూడాలి మరి.