గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ప్రీతి చిచ్చిలి
Last Modified: గురువారం, 7 ఫిబ్రవరి 2019 (22:47 IST)

నటి ఝాన్సీ గురించి మీకు తెలియదు... ఆమెకు నేనొక్కడినే కాదు... లవర్

ఇటీవల పవిత్ర బంధం సీరియల్ నటి ఝాన్సీ ఆత్మహత్య చేసుకున్న తరుణంలో ఆమె లవర్ నానితో ప్రేమ వ్యవహారం బెడిసికొట్టడమే కారణమంటూ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే ఓ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సూర్య అలియాస్ నాని ఈ ఆరోపణలను ఖండించారు. తను నన్ను లవ్ చేసిన మాట నిజమే గానీ నేను ఒప్పుకోకముందే కొన్ని విషయాలు తెలియడంతో తనను దూరం పెట్టానని చెప్పాడు.
 
తనతో నాకు పరిచయమై రెండు నెలల మాత్రమే అయ్యిందని, అంతకుముందు ఆమెకు ఇద్దరు ముగ్గురు ప్రేమికులు ఉండటంతో పాటు వేరే వ్యవహారాల గురించి తెలిసింది. అప్పటి నుండి దూరం పెట్టానని తెలిపాడు. అవకాశాలు ఇప్పిస్తామని చెప్పి బాబీ, గిరి అనే మధ్యవర్తులు తరచూ ఇబ్బంది పెట్టేవారని, ఒకసారి ఈ విషయం తనకు చెప్పగా తానే స్వయంగా గిరి అనే వ్యక్తికి వార్నింగ్ ఇచ్చినట్లు, ఇందులో తప్పెవరిదో తనకు తెలియదని చెప్పాడు.
 
నా వల్లే నటించడం మానేసింది అనే ఆరోపణల్లో అసలు నిజం లేదని, తనకు అప్పటికే అవకాశాలేమీ లేవని స్పష్టం చేసారు. బాబీ, గిరి అనే వ్యక్తుల టార్చర్ వల్లనే ఇలా జరిగిందేమోనని అనుమానం వ్యక్తం చేసాడు. చివరిగా ఆమె తనకు వాట్సప్ సందేశం పంపింది, అంతలోనే డిలీట్ చేసింది, అందులో ఏముందో కూడా తనకు తెలియదని చెప్పాడు సూర్య.