సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సందీప్
Last Updated : గురువారం, 7 ఫిబ్రవరి 2019 (12:21 IST)

పోలీసుల ఎదుటే ఉరేసుకున్న యువకుడు.. ఎందుకు?

గొర్రెల చోరీలో నిందుతుడిగా పోలీసులు అదుపులోకి తీసుకున్న ఒక యువకుడు వారి సమక్షంలోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని చూరూ జిల్లాలోని రతన్‌గఢ్ పోలీసుల పరిధిలో జరిగింది. ఇటీవల పోలీస్ స్టేషన్‌లో గొర్రెల చోరీపై కేసు నమోదైంది. దర్యాప్తులో భాగంగా పోలీసులు మూడు రోజుల క్రితం రతన్‌ఘడ్‌కు చెందిన దినేష్ కుమారుడు భగవతీ ప్రసాద్‌ను విచారించేందుకు పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు. 
 
మూడురోజులుగా అక్కడే ఉంచి అతడిని ఇంటరాగేట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ యువకుడు టాయిలెట్‌కి వెళ్లాలని పోలీసులకు చెప్పాడు. అతనిపై నిఘా ఉంచేందుకు ఒక పోలీసును వెంట పంపించారు. లోపలికి వెళ్లిన నిందితుడు అక్కడే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన అనంతరం ఆ యువకుని కుటుంబసభ్యులు పోలీసుల మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసు విచారణ జరుపుతున్నారు.