సోమవారం, 27 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : గురువారం, 7 ఫిబ్రవరి 2019 (10:41 IST)

"లవర్స్ డే" టీజర్ అదుర్స్.. ప్రియా వారియర్‌కు లిప్ కిస్... (టీజర్)

కేరళ కుట్టి ప్రియా ప్రకాష్ వారియర్. ఒక్క కన్నుగీటితో దేశ వ్యాప్తంగా మంచి పాపులర్ అయిపోయింది. ఆమె నటిస్తున్న 'ఒరు ఆదార్ లవ్' చిత్రంలో ఈమె కన్నుగీటి కుర్రకారు హృదయాలను కొల్లగొట్టింది. 
 
ఈ నేపథ్యంలో ఈ చిత్రాన్ని 'లవర్స్ డే' పేరుతో తెలుగులో కూడా రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రం టీజర్‌ను బుధవారం విడుదల చేశారు. ఒమర్ లులు దర్శకత్వం వహించిన ఈ సినిమా టీజర్‌లో రోషన్ అబ్దుల్, ప్రియా వారియర్ మధ్య వచ్చే సన్నివేశాలు సినీ ప్రేమికులను కట్టిపడేస్తున్నాయి. 
 
ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు సందర్భంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ టీజర్‌ను ఇప్పటికే మూడు లక్షల మందికి పైగా నెటిజన్లు వీక్షించారు.