శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : బుధవారం, 23 జనవరి 2019 (13:09 IST)

శ్రీదేవి బంగ్లా గురించి జాన్వీని అడిగితే?

దివికేగిన అతిలోకసుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ సినీ ప్రేక్షకులను పెద్ద ఎత్తున ఆకట్టుకుంది. దఢక్ సినిమాతోనే యూత్‌కు బాగా కనెక్ట్ అయ్యింది. ఆమె అందాలు సినిమాకు ప్లస్ పాయింట్స్‌గా నిలిచాయి. ప్రస్తుతం రెండో సినిమాలో నటించేందుకు సంతకం చేసేసిన జాన్వీ.. ముంబైలో జరిగిన ఓ ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొంది. 
 
ఆ సమయంలో ప్రియా వారియర్ నటించిన శ్రీదేవి బంగ్లా సినిమాపై చర్చ వచ్చింది. ఈ సినిమాపై జాన్వీ అభిప్రాయాన్ని విలేకరి అడగగా, జాన్వీ నోట మాట రాలేదు. అంతే టక్కున అక్కడి నుంచి జాన్వీ వెళ్లిపోయింది. ఇంకా జాన్వీ మేనేజర్ మీడియా సమావేశాన్ని రద్దు చేసి.. తల్లిని కోల్పోయిన బిడ్డ వద్ద ఇలాంటి ప్రశ్నలేస్తారా అంటూ ఫైర్ అయ్యారు. జాన్వీని అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు.