సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : గురువారం, 17 జనవరి 2019 (12:04 IST)

బరువు తగ్గిన తర్వాత కోరిక తీరుస్తా: అభిమానికి పాయల్ రాజ్‌పుత్ హామీ

తన అభిమానికి 'ఆర్ఎక్స్100' హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ ఓ హామీ ఇచ్చింది. బరువు తగ్గిన తర్వాత అభిమాని కోరికను తప్పకుండా తీరుస్తానని చెప్పింది. గత యేడాది తెలుగు వెండితెరకు పరిచయమైన కుర్రకారు హీరోయిన్లలో పాయల్ రాజ్‌పుత్ ఒకరు. 'ఆర్ఎక్స్ 100' మూవీ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైంది. 
 
ముఖ్యంగా, తన తొలిచిత్రంలోనే హాట్ మూమెంట్స్, లిప్ కిస్‌, అందాల ఆరబోత సీన్లలో బోల్డ్‌గా నటించి ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరిచింది. అలాంటి పాయల్ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 
 
'బికినీ ఫోటో ఉంటే పోస్ట్‌ చేయండి' అంటూ ఓ అభిమాని కోరాడు. దీనికి ఆమె సమాధానమిస్తూ, తాను బరువు తగ్గడానికి వ్యాయామం చేస్తున్నానని, మంచి శరీరాకృతి వచ్చిన తర్వాత తప్పకుండా బికినీ ఫోటోలు పోస్ట్ చేస్తానని తెలిపింది. 
 
ఆపై మరికొందరి ప్రశ్నలకు జవాబిస్తూ, తన తల్లితో కలిసి 'ఆర్ఎక్స్ 100' సినిమా చేస్తుంటే కాస్తంత ఇబ్బందిగా అనిపించిందని, కానీ ఆమె ధైర్యం చెప్పిందని తెలిపింది. తన ప్రాధాన్యత తొలుత కుటుంబానికేనని, ఆపైనే కెరీర్ అని, సాంబార్ రైస్ అంటే తనకు అమితమైన ఇష్టమని వెల్లడించింది.