గురువారం, 26 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : శనివారం, 19 జనవరి 2019 (09:50 IST)

విరాట్ కోహ్లీ చేతుల్లో ట్రోఫీ పెట్టి వెళ్లిపొమ్మన్నారు...

ఆస్ట్రేలియా గడ్డపై కొత్త శకం లిఖించిన భారత క్రికెట్ జట్టుకు ఈ టోర్నీ నిర్వాహకులు ఉత్తిచేతులతో పంపనున్నారు. టోర్నీ విజేతగా నిలిచిన భారత జట్టుకు కేవలం ట్రోఫీ మాత్రమే ఇచ్చారు. పైసా నగదు బహుమతి ఇవ్వలేదు. దీన్ని క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ తప్పుబట్టారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ఈ సిరీస్ ద్వారా నిర్వాహక బోర్డు భారీ ఆదాయాన్ని అర్జించిందన్నారు. ఇలా సంపాధించిన డబ్బులో ఆటగాళ్లకు కూడా వాటా ఉంటుందన్నారు. శుక్రవారం జరిగిన వన్డే మ్యాచ్‌లో 'ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' అవార్డు ద్వారా 500 అమెరికా డాలర్లను పొందిన కుల్దీప్ యాదవ్, 'ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌' అవార్డు పొందిన ఎంఎస్‌ ధోనీ తనకు వచ్చిన 500 అమెరికా డాలర్లను ఛారిటీ సంస్థకు విరాళంగా అందించారు. 
 
విజేతగా నిలిచిన భారత జట్టుకు కేవలం ఒక ట్రోఫీని బహుకరించారు. దీంతో గవాస్కర్‌ నిర్వాహకుల వైఖరిని తప్పుబడుతూ.. 'వన్డే సిరీస్‌ గెలిచిన భారత్‌కు నగదు బహుమతి ఏమీలేకుండా… ట్రోఫీ మాత్రమే ఇవ్వడం విచారకరం. నిర్వాహకులు టీవీ ప్రసార హక్కులను అమ్మి లెక్కలేనంత రాబడిని పొందుతున్నారు. విజేతలకు వారు ఎందుకు చెప్పుకోదగ్గ నగదును ఇవ్వరు. ఈ ఆటలో పాలుపంచుకునే ఆటగాళ్లందరూ ఈ మనీ రావడానికి కారణం కాదా' అంటూ సునీల్ గవాస్కర్ ప్రశ్నించారు.