'భారతీయుడు' సినిమాకు స్ఫూర్తి తాహసీల్దారు కార్యాలయమే : డైరెక్టర్ శంకర్
దాదాపు రెండు దశాబ్దాల క్రితం వచ్చిన చిత్రం 'భారతీయుడు' (ఇండియన్). ఈ చిత్రం సీక్వెల్‌గా "భారతీయుడు-2"ను తెరకెక్కించే పనిలో దర్శకుడు శంకర్ నిమగ్నమయ్యారు. అయితే, 'భారతీయుడు' చిత్ర కథ తయారు చేయడానికి తనకు స్ఫూర్తిగా ఉన్న ఓ సంఘటనను డైరెక్టర్ శంకర్ గుర్తుచేశాడు.
తాను కాలేజీ చదువుకునే రోజుల్లో ఆదాయ, కుల ధృవీకరణ పత్రాల కోసం తాహసీల్దారు కార్యాలయానికి వెళితే లంచం అడిగారన్నారు. ఈ ఘటనే 'భారతీయుడు' చిత్రం తీయడానికి ప్రేరణగా నిలిచిందన్నారు. సామాన్య ప్రజానీకాన్ని ప్రతి సమస్యా ఎంత ఇబ్బందికి గురిచేస్తుందనే విషయం 'ఇండియన్-2'లో చూపించనున్నట్లు తెలిపాడు.
కాగా, 'భారతీయుడు-2' చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయగా, తాజాగా రెండో పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ చిత్రం శనివారం నుంచి నుంచే రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. తాజా లుక్‌లో ఓల్డర్.. వైజర్.. డెడ్లియర్ క్యాప్షన్స్‌తో మరింత పవర్‌ఫుల్‌గా కమల్ కనిపిస్తున్నాడు.