శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : మంగళవారం, 15 జనవరి 2019 (11:39 IST)

కమల్ హాసన్ లుక్ కేక - 'భారతీయుడు-2' ఫస్ట్ లుక్ ఇదే

విశ్వనటుడు కమల్ హాసన్ నటిస్తున్న తాజా చిత్రం 'భారతీయుడు-2' (ఇండియన్-2). ఎస్.శంకర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను తాజాగా రిలీజ్ చేశారు. 1996లో వచ్చిన భారతీయుడు చిత్రానికి సీక్వెల్‌గా ఈ చిత్రం రానుంది. సంక్రాంతి పండుగ తర్వాత ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభంకానుంది. 
 
అయితే, ఈ చిత్రంలో కమల్ హాసన్ లుక్ ఎలా ఉంటుందో చూడాలనే ఆసక్తి అందరిలోనూ ఉంది. ఈ నేపథ్యంలో చిత్ర టీమ్ సోమవారం రాత్రి కమల్ లుక్‌ను రిలీజ్ చేసింది. ఓల్డ్ గెటప్‌లో సేనాపతిగా కమల్ గెటప్ కేక పుట్టించేలా ఉంది. లుక్ చూసిన ప్రేక్షకులంతా థ్రిల్ ఫీలవుతున్నారు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ కథానాయకిగా నటిస్తోంది.