శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : బుధవారం, 16 జనవరి 2019 (12:37 IST)

న్యూ లుక్‌లో చియాన్ విక్రమ్ : 'కదరం కొండన్' ఫస్ట్ లుక్ (వీడియో)

గత కొంతకాలంగా సరైన హిట్టు లేకుండా వరుస పరాజయాలతో కొట్టుమిట్టాడుతున్న చియాన్ విక్రమ్ ఇపుడు తన పంథాను మార్చాడు. 'చీకటి రాజ్యం' చిత్రం దర్శకుడు రాజేష్ ఎం. సెల్వ డైరెక్షన్‌లో తెరకెక్కిన చిత్రం 'కదరం కొండన్'. ఈ చిత్రం ఫస్ట్ లుక్‌కు మంచి స్పందన వచ్చింది. 
 
తాజాగా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని చిత్ర యూనిట్ ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసింది. ఇక ఈ టీజర్‌లో విక్రమ్ న్యూ లుక్‌లో చాలా స్టైలిష్‌గా ఉండటంతో అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. ఇక ఈ చిత్రాన్ని యూనివర్సల్‌ హీరో కమల్‌ హాసన్‌.. తన సొంత నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మిస్తున్నారు. 
 
ఈ చిత్రంలో కమల్ హాసన్ చిన్న కూతురు అక్షరా హాసన్ కూడా నటించారు. ఇక వరుస ఫ్లాపుల్లో ఉన్న కమల్ హాసన్, విక్రమ్‌లు కలిసి చేస్తున్న ఈ సినిమాతో వీళ్లిద్దరు సక్సెస్ అందుకుంటారా అనేది వేచి చూడాలి. ఇక ఇప్పటికే శంకర్‌ దర్శకత్వంలో కమల్‌ హాసన్‌ నటిస్తున్న 'భారతీయుడు-2' ఫస్ట్‌ లుక్‌ను కూడా సంక్రాంతి సందర్భంగా చిత్ర బృందం విడుదల చేసిన విషయం తెలిసిందే.