సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : శనివారం, 12 జనవరి 2019 (17:08 IST)

కమల్ హాసన్ పార్టీలో శృంగారతార షకీలా..

సినిమా ప్రముఖులు రాజకీయాల్లోకి రావడం ప్రస్తుతం ఫ్యాషనైపోయింది. నటనాపరంగా మంచి పాపులారిటీ సంపాదించుకుని రాజకీయాల్లోకి దిగేడం ప్రస్తుతం సెలెబ్రిటీల పనైపోయింది. ప్రస్తుతం తమిళనాడులో సూపర్ స్టార్ రజనీకాంత్, సినీ లెజెండ్ కమల్ హాసన్‌లు రాజకీయాల్లో అడుగుపెట్టాడు. తాజాగా కమల్ పార్టీకి తమిళనాట మంచి ఆదరణ లభిస్తోంది. 
 
ఈ పార్టీలో నటీమణులు శ్రీప్రియ, రచయిత స్నేహన్ వంటి పలు సినీతారలు చేరారు. ఈ నేపథ్యంలో శృంగార తార, మలయాళ నటీమణి షకీలా కూడా కమల్ మక్కల్ నీది మండ్రంలో చేరనున్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్ వస్తోంది. 
 
ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో షకీలా వెల్లడించింది. తాను కమల్ హాసన్ అభిమానిని అని.. సమయం దొరికినప్పుడు ఆయన సినిమాలు చూస్తుంటానని.. ఆయన ప్రారంభించిన పార్టీలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నానని షకీలా వెల్లడించింది.