శుభ్‌మన్ - శంకర్‌లకు లక్కీఛాన్స్...

vijay shankar
Last Updated: ఆదివారం, 13 జనవరి 2019 (10:34 IST)
యువ క్రికెటర్లు శుభ్‌మన్, శంకర్‌లు లక్కీఛాన్స్ కొట్టేశారు. ఓ టీవీ కార్యక్రమంలో పాల్గొన్న భారత క్రికెటర్లు హార్దిక్ పాండ్య, కేఎల్ రాహుల్‌లు మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారు. దీంతో వారిపై రెండు మ్యాచ్‌ల నిషేధం పడింది. వీరి స్థానంలో ఆస్ట్రేలియా పర్యటనకు యువ క్రికెటర్లు శుభ్‌మన్, శంకర్‌లను ఎంపికచేశారు.

వీరిలో విజయ్ శంకర్ ఆల్‌రౌండర్ కాగా, శుభ్‌మన్ గిల్ మాత్రం బ్యాట్స్‌మెన్. వీరిద్దరనీ బీసీసీఐ సీనియర్ సెలక్షన్ కమిటి ఎంపిక చేసింది. ఆస్ట్రేలియాతో జరిగే చివరి రెండు మ్యాచ్‌లకు వీరిద్దరూ అందుబాటులో ఉంటారు. కాగా, తొలి వన్డేలో భారత్ ఓడిపోగా, రెండో వన్డే మ్యాచ్ మంగ‌ళ‌వారం అడిలైడ్‌ వేదికగా జరుగనుంది.

మ‌రోవైపు శంకర్ ఇప్ప‌టికే టీ20ల్లో భారత తరపున అరంగేట్రం చేసిన విష‌యం తెలిసిందే. ఆసీస్‌తో రెండో వ‌న్డే ఆరంభానికి ముందే శంక‌ర్ జ‌ట్టుతో క‌ల‌వ‌నున్నాడు. న్యూజిలాండ్‌తో వ‌న్డే, టీ20 సిరీస్‌ల‌కు దేశ‌వాళీ క్రికెట్లో అద్భుతంగా రాణిస్తున్న‌ యువ క్రికెట‌ర్ శుభ్‌మ‌న్‌ను ఎంపిక చేశారు. అలాగే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌తో సిరీస్‌ల‌కు ఎంపికైన‌ రాహుల్‌, పాండ్యల స్థానాలను శుభ్‌మ‌న్‌, శంక‌ర్‌ల‌తో భ‌ర్తీ చేశారు.దీనిపై మరింత చదవండి :