గతుకుల రోడ్డుకి ఎంత ఫైన్ కడతారు?: ద్విచక్ర వాహనదారుడు డిమాండ్ (video)
రోడ్లు అధ్వాన్నంగా వుండటంపైన ఓ ద్విచక్ర వాహనదారుడు వినూత్నమైన నిరసనకు దిగాడు. తెలంగాణలోని ఓ రహదారి గతుకులమయంగా వుండటంపై అతడు ఓ ప్లకార్డు పట్టుకుని రోడ్డుపై బైఠాయించాడు.
ఆ ప్లకార్డులో... పోలీసు కమీషనర్ మరియు కలెక్టర్ గారికి, రోడ్డు పైన నేను వాహనం నడిపేటపుడు ఏది ధరించకపోయినా అన్నింటికి ఫైన్ కడుతున్నాను. అసలు రోడ్లు సరిగా లేవు. మరి మీరు నాకు ఎంత ఫైన్ కడతారు? మీ భారతీయుడు కోట శ్యామ్ కుమార్ అంటూ ఆ ప్లకార్డులో రాసాడు. ఈయన చేస్తున్న నిరసనకు నెటిజన్లు పూర్తి మద్దతు తెలుపుతున్నారు. శభాష్ బ్రో... బాగా అడుగుతున్నారు, మీకు మా ఫుల్ సపోర్ట్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.