1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
  4. Snake gets got to insects in Australia

బలవంతమైన సర్పము వందలాది పురుగుల చేత చిక్కితే?

Snake
బలవంతమైన సర్పము చలి చీమల చేత చిక్కితే అంతే సంగతులు. ఇదే తరహాలో ఓ కొండ చిలువ పురుగుల చేత చిక్కుకుంది. ఆస్ట్రేలియాలో ఒళ్లంతా వందలాది పురుగులతో కూడిన కొండ చిలువను అటవీ శాఖాధికారులు కనుగొన్నారు. వివరాల్లోకి వెళితే.. క్వీన్స్‌లాండ్‌లోకి ఓ ఇంటి వెనుక గల స్విమ్మింగ్ పూల్‌లో ఒళ్లంతా వందలాది పురుగులతో కూడిన కొండ చిలువను కనుగొన్నారు. 
 
పురుగులు ఒళ్లంతా నిండివుండటంతో పాము అనారోగ్యానికి గురైంది. ఈ పామును కనుగొన్న అటవీ శాఖాధికారులు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆస్పత్రిలో చికిత్స అందించిన వైద్యులు.. ఆ పాము శరీరం నుంచి 500 పురుగులను తొలగించారు. 
 
ప్రస్తుతం కొండ చిలువ ఆరోగ్యం నిలకడగా వుందని వైద్యులు తెలిపారు. పురుగులు అలా శరీరంపై వుండిపోవడం ద్వారా ఆ పాము నరకయాతన అనుభవించిందని.. వైద్యులు తెలిపారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో షేర్ అవుతున్నాయి.
తర్వాతి కథనం
నువ్వు ఇంతకీ ఆడా? మగా? పోలీసు ప్రశ్న... ఏం సమాధానం వచ్చిందో తెలుసా?