గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : శనివారం, 12 జనవరి 2019 (18:50 IST)

సహజీవనం పేరిట మోసం.. భార్యపిల్లలున్నా చెప్పలేదు.. ఉరేసి చంపేశాడు..

పాశ్చాత్య సంస్కృతి, స్మార్ట్ ఫోన్ల పుణ్యమా అంటూ సహజీవనం, డేటింగ్ కల్చర్ దేశంలోకి వ్యాపిస్తోంది. ఈ కల్చర్ ప్రభావంతో నేరాల సంఖ్య పెరిగిపోతున్నాయి. తాజాగా ప్రియుడితో సహజీవనం చేసిన ఓ యువతి దారుణ హత్యకు గురైన ఘటన శ్రీకాకుళంలో చోటుచేసుకుంది.


వివరాల్లోకి వెళితే.. శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలంలోని మొగులుకొత్తూరు గ్రామానికి చెందిన లక్ష్మీ అనే 24 ఏళ్ల యువతికి... అదే జిల్లాకు చెందిన రామరాజు అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది.
 
రామరాజుకు భార్యాపిల్లలు వున్నారు. ఈ విషయాన్ని ప్రేయసికి దాచి పెట్టాడు. పెళ్లి చేసుకుంటానని లోబరుచుకున్నాడు. కానీ రామరాజుకు భార్య పిల్లలున్నారని తెలిసి లక్ష్మీ నిలదీసింది. కానీ అందరూ కలిసుందామని మాయమాటలు చెప్పాడు. అందుకు ఆమె అంగీకరించకపోవడంతో పాటు గొడవకు దిగింది. దీంతో గురువారం ఫూటుగా తాగొచ్చిన రామరాజు.. లక్ష్మీతో గొడవకు దిగాడు. 
 
ఆవేశంలో తాడుతో ఉరేసి దారుణం హతమార్చాడు. ఆమె అనారోగ్యంతో చనిపోయినట్లు స్థానికులను నమ్మించాడు. అయితే ఆమె మెడకు పసుపు రాసి వుంచడాన్ని చూసిన పొరుగింటివారు పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. లక్ష్మీని రామరాజు హత్య చేసినట్లు తేల్చారు.