ఆదివారం, 26 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Modified: శుక్రవారం, 18 జనవరి 2019 (14:19 IST)

కోహ్లీ-ధోనీ బ్యాటింగ్... ఇండియా 27 ఓవర్లకు 104/2

భారత్-ఆసీస్ మధ్య జరుగుతున్న వన్డే మ్యాచ్‌లో 27 ఓవర్లకు రెండు వికెట్లు కోల్పోయింది భారత జట్టు. ప్రస్తుతం క్రీజులో విరాట్ కోహ్లి-ధోనీ వున్నారు. 27 ఓవర్లకు 2 వికెట్లు కోల్పోయి 104 పరుగులు చేశారు. 
 
ఇక అంతకుముందు.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు పూర్తి ఓవర్ల కోటా ముగియకముందే ఆలౌట్ అయింది. అంటే 48.4 ఓవర్లలో అన్ని వికెట్లను కోల్పోయి 230 పరుగులు చేసింది. భారత స్పిన్నర్ చాహెల్ మాయాజాలంముందు కంగారులు బెంబేలెత్తిపోయారు. దీంత భారత్ ముంగిట 231 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచినట్టయింది. 
 
ఈ మ్యాచ్‌కు తొలుత వరుణదేవుడు ఆటంకం కలిగించాడు. ఆ తర్వాత మ్యాచ్ కొనసాగినప్పటికీ ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్లు కుదురుగా బ్యాటింగ్ చేయలేక పోయారు. ఆసీస్ బ్యాట్స్‌మెన్లలో కారీ 5, ఫించ్ 14, ఖవాజా 34, మార్ష్ 39, కాంబ్ 58, స్టోయిన్స్ 10, మాక్స్‌వెల్ 26, రిచర్డ్‌సన్ 16, జంపా 8 చొప్పున పరుగులు చేశారు. స్టాన్ లేక్ డకౌట్ కాగా, సిడిల్ పది పరుగులు చేశారు. ముఖ్యంగా, భారత స్పిన్నర్ చాహెల్ విజృంభించి ఏకంగా 6 వికెట్లు తీశాడు. భువనేశ్వర్, షమీలు రెండేసి వికెట్లు తీశారు. 
 
ముఖ్యంగా, వైఎస్ చాహెల్ పది ఓవర్లు వేసి ఆరు వికెట్లు తీశాడు. 4.20 సగటుతో 32 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఆస్ట్రేలియా గడ్డపై ఒకే మ్యాచ్‌లో ఏకంగా ఆరు వికెట్లు తీసిన భారత స్పిన్నర్‌గా చాహెల్ రికార్డు సృష్టించాడు.