గురువారం, 3 ఏప్రియల్ 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By దేవీ
Last Updated : బుధవారం, 2 ఏప్రియల్ 2025 (10:21 IST)

Varma: ఆర్జీవీ అనుభవాలతో శారీ సినిమా తెరకెక్కించాడా !

Satya Yadhu, Aaradhya, Varma
Satya Yadhu, Aaradhya, Varma
సోషల్ మీడియాను మితిమీరి ఉపయోగించడం వల్ల వచ్చే సాధకబాధలతో వర్మ శారీ సినిమా నిర్మించాడు. అయితే ఆయన తన అనుభవాలతో కథను రాసుకున్నాడని తెలిసింది. సోషల్ మీడియాను ఆయన ఉపయోగించుకున్నట్లుగా ఎవ్వరూ ఉపయోగించరని గతంలో ఆయనే వెల్లడించారు. ఇక ఈ సినిమాలో సత్య యాదు, ఆరాధ్య దేవి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని సైకలాజికల్ థ్రిల్లర్ కథతో దర్శకుడు గిరి కృష్ణ కమల్ రూపొందించారు.

ట్రైలర్ చూస్తే, ప్రేమ, హింస, శాడిజం, శ్రుంగారం వంటి అంశాలు ఇందులో వున్నాయి. సోషల్ మీడియాలో వర్మ కూడా తన పర్సనల్ ప్రేమను హీరోయిన్లతో వ్యక్తం చేస్తూ బాగా పాపులర్ అయ్యాడనేది అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో కూడా వర్మ క్యారెక్టర్ ను సత్యయాదులో చూపించాడని తెలుస్తోంది.

ఆర్జీవీ, ఆర్వీ ప్రొడక్షన్స్ ఎల్ఎల్ పీ బ్యానర్‌పై రవిశంకర్ వర్మ నిర్మించారు. 'శారీ' సినిమా ఈ నెల 4న తెలుగు, హిందీ, తమిళం, మలయాళ భాషలలో పాన్-ఇండియా స్థాయిలో విడుదల కానుంది. హైదరాబాద్ లో 'శారీ' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు.  
 
డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ - సోషల్ మీడియాను మితిమీరి ఉపయోగించడం వల్ల జీవితంలో ఎలాంటి భయంకరమైన పరిస్థితులు ఏర్పడటానికి అవకాశాలు ఉన్నాయి అనే పాయింట్ మీద చేసిన చిత్రమే 'శారీ'. ఈ సినిమాకు నేను మూల కథ అందించాను. నేను చేసిన స్క్రిప్ట్ కంటే చాలా గొప్పగా దర్శకుడు గిరికృష్ణ కమల్ మూవీని రూపొందించాడు. కమల్ నాతో చాలా కాలంగా జర్నీ చేస్తున్నాడు. నా మూవీస్ కు వర్క్ చేశాడు. తనతో ఈ సబ్జెక్ట్ గురించి డిస్కషన్ చేసినప్పుడు అతని ఆలోచనలు నచ్చి మూవీ డైరెక్ట్ చేసే అవకాశం ఇచ్చాను. కథ రాసినప్పుడు నేను ఊహించుకున్న దాని కంటే బాగా మూవీని రూపొందించాడు. డీవోపీ శబరి, మ్యూజిక్ డైరెక్టర్ శశిప్రీతమ్..ఇలా నా టీమ్ అంతా 'శారీ' సినిమాకు మంచి ఔట్ పుట్ ఇచ్చారు. శశిప్రీతమ్. సినిమాలోని మూడు పాటలకు సుభాష్ మంచి కొరియోగ్రఫీ చేశాడు. శారీ సినిమాకు టాలెంటెడ్ టీమ్ వర్క్ చేసింది. నా కంటే వాళ్ల కాంట్రిబ్యూషన్ ఈ సినిమాకు ఎక్కువగా ఉందని చెప్పగలను. అన్నారు.
 
హీరోయిన్ ఆరాధ్య దేవి మాట్లాడుతూ, ఈ పాత్రలో నటించేందుకు కావాల్సినంత ఫ్రీడమ్ ఇచ్చారు డైరెక్టర్ కృష్ణకమల్. ఈ సినిమా చేయడం నాకొక వర్క్ షాప్ లా అనిపించింది. సత్య యాదు మంచి కోస్టార్. ఆయనతో వర్క్ చేయడం హ్యాపీగా ఉంది అన్నారు.
 
హీరో సత్య యాదు మాట్లాడుతూ,  ఒక ఇంటెన్స్ డ్రామాతో మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. తక్కువ పాత్రలు అయినా ఎఫెక్టివ్ గా ఉంటాయి. నా పర్ ఫార్మెన్స్ మీకు నచ్చుతుందని ఆశిస్తున్నా. అలాగే ఆరాధ్య కూడా సూపర్బ్ గా నటించింది అన్నారు.