సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 3 ఫిబ్రవరి 2019 (14:43 IST)

నా భర్తను నా శవాన్ని తాకనీయొద్దు... వైద్యురాలి సూసైడ్ నోట్

గుజరాత్‌ రాష్ట్రంలో ఓ మహిళా వైద్యురాలు ఆత్మహత్య చేసుకుంది. ఆమె బలవన్మరణానికి పాల్పడే ముందు సూసైడ్ లేఖ రాసిపెట్టింది. తన మృతదేహాన్ని తన భర్తతో తాకనివ్వొద్దని ఆమె కోరింది. దీంతో ఆత్మహత్య కేసులో భర్త హస్తముందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
గుజరాత్‌లో అడాజన్‌ పోలీస్ స్టేషన్‌ పరిధిలోని శివకుటీర్ అపార్ట్‌మెంట్‌లోడాక్టర్ మాలిని(29)కి ఆరేళ్ల క్రితం డాక్టర్ చింతిత్ పటేల్ అనే వ్యక్తితో వివాహమైంది. ఆ తర్వాత మాలిని భర్తతో పాటు.. ఆయన కుటుంబ సభ్యులు వేధించసాగారు. ఈ నేపథ్యంలో మాలిని ఆత్మహత్య చేసుకుంది. ఆమె చనిపోయే ముందు రాసిన లేఖలో... తన చావుకు అత్తింటి వారి వేధింపులే కారణమని పేర్కొంది. 
 
అయితే, తన మృతదేహాన్ని భర్తను తాకనీయవద్దని కోరింది. దీంతో మాలిని మృతదేహానికి ఆమె పుట్టింటివారు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. మాలిని ఫోనును స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.