సినీ ఫక్కిలో బిర్యానీ కోసం జగడం.. పెళ్లైన గంటల్లో విడాకులు.. ఎక్కడ?
భోజనం విషయంలో ఏర్పడిన వివాదం.. విడాకుల వరకు వెళ్లింది. ఈ ఘటన గుజరాత్‌లో చోటుచేసుకుంది. వివాహమైన గంటల్లో ఆ కొత్త దంపతులు విడిపోయారు. పెళ్లికి వచ్చిన బహుమతులు, కానుకలు అక్కడే వుండిపోయాయి. వధువు చేతికి వేసిన గోరింటాకు పండి గంటల్లో ఆ వివాహం విడాకులకు దారితీసింది. వివరాల్లోకి వెళితే.. గుజరాత్, గోండల్ ప్రాంతంలో ఓ జంటకు అట్టహాసంగా వివాహం జరిగింది.
ఆహార పదార్థాల్లో వెరైటీలు లేవని ఇరు వర్గాల బంధువులు వాగులాటకు దిగారు. ఆహార పదార్థాలను ఒకరిపై ఒకరు విసిరేసుకుంటూ పెళ్లిని పెటాకులు చేసి వెళ్లిపోయారు. సినీ ఫక్కీలో జరిగిన ఈ ఘటనకు కొత్త దంపతులు బలైపోయారు.
అమ్మాయి తరపు వారు మటన్ బిర్యానీ అడిగితే చికెన్ బిర్యానీ పెట్టారనే కోపంతో పెళ్లికొడుకు తరపు బంధువులు జగడానికి దిగారు. దీంతో ఈ వివాహం రద్దు అయ్యింది. ఫలితంగా దేశంలోనే అతి తక్కువ కాలంలో విడాకులు పొందిన జంటగా ఈ కొత్త దంపతులే నిలిచివుంటారు.