సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By జె
Last Modified: గురువారం, 7 ఫిబ్రవరి 2019 (17:52 IST)

ఝాన్సీ సుసైడ్ నోట్‌లో నమ్మలేని నిజాలు.. ఏంటవి?

హైదరాబాద్ లోని శ్రీనగర్ కాలనీలో ఆత్మహత్యకు పాల్పడిన టీవీ నటి ఝాన్సీ వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లోను తీవ్ర చర్చ జరుగుతోంది. ప్రేమ ఫెయిలవడంతోనే ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమిక నిర్థారణకు వచ్చారు. ఇదే విషయాన్ని ఝాన్సీ తల్లిదండ్రులకు తెలియజేశారు. మృతురాలు స్వగ్రామం క్రిష్ణాజిల్లా ముదినేపల్లి మండలం వాడానిగ్రామం. మాటివి పవిత్ర బంధం సీరియళ్ళలో నటిస్తోంది ఝాన్సీ.
 
స్వగ్రామం నుంచి రెండు సంవత్సరాల క్రితం ఝాన్సీ హైదరాబాద్‌కు వచ్చింది. శ్రీనగర్ లోని ఒక అపార్టుమెంట్‌లో తమ్ముడితో కలిసి నివాసముంటోంది. ఆరు నెలల క్రితం పరిచయమైన సూర్యతో ప్రేమాయణం సాగించినట్లు సూసైడ్ నోట్‌లో తెలిపింది. ఐదు నెలలుగా సూర్యకు సర్వస్వం అప్పజెప్పానని, అతనిపై ఎంతో నమ్మకం ఉంచానని, పెళ్ళి చేసుకుంటానని చెప్పి చివరకు తప్పించుకుని తిరుగుతున్నాడని సూసైడ్ నోట్‌లో పేర్కొంది.
 
దాంతో పాటు తనకు ఇద్దరితో అక్రమ సంబంధం కూడా ఉన్నట్లు సూర్య దుష్ర్పచారం చేస్తున్నాడని కూడా సుసైడ్ నోట్‌లో తెలిపింది. ఈ లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దాంతో పాటు వాట్సాప్‌లో సూర్యతో చాట్ చేయడంతో సెల్ ఫోన్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు. అయితే సూర్య మాత్రం ఝాన్సీ ఆత్మహత్యకు తనకు ఎలాంటి సంబంధం లేదని అంటున్నాడు.