1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. World countries study corruption of Jagan: TDP

జగన్ అవినీతిపై ప్రపంచ దేశాలు అధ్యయనం: టీడీపీ

World countries
ఏపీ సీఎం జగన్ అవినీతిపై ప్రపంచ దేశాలు అధ్యయనం చేస్తున్నాయని టీడీపీ నేత రామానాయుడు ఆరోపించారు. ఉన్మాదంతోనే టీడీపీపై ఆమంచి విమర్శలు చేస్తున్నారని రామానాయుడు మండిపడ్డారు.

ఆమంచి కృష్ణమోహన్ రౌడీ చరిత్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్నారు. టీడీపీలో ఉన్నప్పుడే జగన్‌తో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని తల్లిలాంటి టీడీపీకి ద్రోహం చేశారని రామానాయుడు ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీకి ఓటమి ఖాయమని గ్రహించి వైసీపీ నేతలు రాష్ట్రంలో విధ్వంసం సృష్టిస్తున్నారని రామానాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.

అధికారాన్ని అడ్డుపెట్టుకుని జే ట్యాక్స్ పేరుతో రాష్ట్రాన్ని లూటీ చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రాన్ని 30 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లిన వైసీపీని ప్రజలు చీత్కరిస్తున్నారని, స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు బుద్ధి చెబుతారని రామానాయుడు అన్నారు.
About Writer
ఎం
తర్వాతి కథనం
టీఆరెస్ రాజ్యసభ అభ్యర్థులు వీరే