శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 11 మార్చి 2020 (06:01 IST)

ఈఎస్‌ఐ ఆస్పత్రుల్లో అవినీతిని ఏరిపారేయండి: జగన్

ఈఎస్‌ఐ ఆస్పత్రుల్లో అవినీతి ఉండకూడదని, వ్యవస్థల్లో ఉన్న అవినీతిని ఏరిపారేయాలి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి అధికారులకు సూచించారు. అవినీతివల్ల పేదలైన కార్మికులు తీవ్రంగా నష్టపోతారని, మందుల కొనుగోలులో పారదర్శకత ఉండాలన్నారు.

కార్మికుల సంక్షేమం, వారికి అందుతున్న వైద్య సౌకర్యాలపై క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి కార్మికశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈఎస్‌ఐ ఆస్పత్రుల్లో అవినీతిపై కూడా సమావేశంలో ప్రస్తావించారు.

ఈ క్రమంలో మందులు కొనాల్సిన డబ్బులతో కాస్మొటిక్స్‌ కూడా కొన్నారని అధికారులు  సీఎం జగన్‌కు వెల్లడించారు. కాగా ఈఎస్‌ఐ ఆస్పత్రుల్లో అవినీతి ఉండకూడదని, వ్యవస్థల్లో ఉన్న అవినీతిని ఏరిపారేయాలి ఆయన అధికారులకు సూచించారు. అవినీతివల్ల పేదలైన కార్మికులు తీవ్రంగా నష్టపోతారని, మందుల కొనుగోలులో పారదర్శకత ఉండాలన్నారు.

కొనుగోలు చేసిన మందుల్లో జీఎంపీ ప్రమాణాలు ఉండాలని, ఈఎస్‌ఐ బిల్లులు ఎప్పటికప్పుడు విడుదల చేయాలని పేర్కొన్నారు. వైద్యసేవల్లో నాణ్యత కోసం ఇప్పటికే కొన్ని ప్రమాణాలు నిర్దేశించుకున్నామని, ఆ ప్రమాణాలు ఈఎస్‌ఐ ఆస్పత్రుల్లో ఉండేలా చూడాలని చెప్పారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి ఒక బోధన ఆస్పత్రితో పాటు నర్సింగ్‌ కాలేజీని కూడా ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం వెల్లడించారు.

దీంతో ప్రస్తుతం ఉన్న బోధన ఆస్పత్రుల సంఖ్య 11 నుంచి 27కు పెంచుతున్నందునా పెద్ద సంఖ్యలో వైద్యులు ఈ కాలేజీల నుంచి వస్తారన్నారన్నారు. వీరి సేవలనుకూడా ఈఎస్‌ఐ ఆస్పత్రుల్లో వినియోగించుకునేలా చూడాలని సీఎం జగన్‌ అధికారులకు తెలిపారు. వైద్య ఆరోగ్యశాఖతో అనుసంధానమై ఈఎస్‌ఐ ఆస్పత్రులను కూడా పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని, ఆసుపత్రితో సేవల మెరుగు కోసం ప్రతిపాదనలు ఇవ్వాలని ఆదేశించారు.

కాగా ఆ మేరకు చర్యలు తీసుకోవాలని చెప్పిన ఆయన కాలుష్య నివారణపైనా కూడా గట్టి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాగే రాష్ట్రాన్ని కాలుష్యం బారినుంచి కాపాడుకోవాలని సీఎం జగన్‌ అధికారులకు సూచించారు. కాలుష్యం బారిన పడకుండా చూసుకుంటే రాష్ట్రానికి మేలు చేసినట్టేనని, సముద్రంలోకి విచ్చలవిడిగా వ్యర్థాలు వదిలేస్తున్నారని పేర్కొన్నారు.

దీనివల్ల పర్యావరణానికి తీవ్ర నష్టం, భావితరాలు తీవ్రమైన ముప్పును ఎదుర్కొంటాయన్నారు. కాలుష్య నివారణ ప్రమాణాలు డిస్‌ప్లే చేయాలని, కాలుష్యం వల్ల అందులో పనిచేసే కార్మికుల ఆరోగ్యానికీ ఇబ్బందులు వస్తాయన్నారు. కార్మిక శాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీపైనా దృష్టిపెట్టాలని అధికారులను ఆదేశించారు.

కాగా ఎల్‌ఐసీ నుంచి బీమా చెల్లింపు నిలిచిపోయాయని, ఎన్నిసార్లు అడిగినా స్పందించడం లేదని కార్మిక శాఖ అధికారులు సీఎం దృష్టికి తీసుకేళ్లారు. ఇక బీమా రూపంలో ఎల్‌ఐసీ బకాయిలు పడ్డ చెల్లింపు కోసం ప్రధాని మోదీకి లేఖ రాస్తామని సీఎం జగన్‌ తెలిపారు.