శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : ఆదివారం, 8 మార్చి 2020 (14:20 IST)

బీసీల పట్ల ఉన్న వైఎస్ కుటుంబానికి ఉన్న ద్వేషాన్ని బయటపెట్టారు

రిజర్వేషన్లు 50% దాటరాదని కోర్టుకు వెళ్లి తీర్పు తెచ్చుకున్నారు' అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. దీనిపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న స్పందించారు. 
 
రెడ్డి సంఘం నేత బిర్రు ప్రతాప్ రెడ్డితో ఏపీ సీఎం జగన్‌ కేసు వేయించి 34 శాతం బీసీ రిజర్వేషన్లలో 24 శాతానికి కోత పెట్టారని, సుప్రీంకోర్టుకి వెళ్లకుండా ఎన్నికలకు వెళ్లారని  బుద్ధా వెంకన్న మండిపడ్డారు. బీసీల పట్ల ఉన్న వైఎస్ కుటుంబానికి ఉన్న ద్వేషాన్ని మరోసారి బయట పెట్టారని ఆరోపించారు. 
 
'చట్టబద్ధంగా వచ్చే రిజర్వేషన్లు కాలరాసి బీసీలు జగన్ గారి దయా దాక్షిణ్యాలపై బతకాలి అని హుకుమ్ జారీ చేస్తున్నారు. బి ఫారం భిక్ష వేస్తున్నట్టు పోజులు కొడుతున్న జగన్ గారికి, ఈ కుట్రకి డైరక్షన్ చేసిన విజయసాయిరెడ్డి గారికి బీసీల సత్తా ఏంటో చూపిస్తారు' అని ట్వీట్లు చేశారు.