ఫనీంద్ర రాసలీలలు.. మహిళతో యవ్వారం.. వీడియో తీసి వాట్సాప్ గ్రూపులో షేర్ చేసి..?
వైసీపీ నేత ఫనీంద్ర రాసలీలలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శింగనమల వైసీపీ బీసీ సెల్ అధ్యక్షుడిగా వున్న ఫనీంద్ర ఒక మహిళతో సన్నిహితంగా వున్న సమయంలో స్వయంగా వీడియో తీసుకున్నాడు. ఈ వీడియోను తానే స్వయంగా వాట్సాప్ గ్రూపులో షేర్ చేశారు.
ఈ వీడియో వైరల్ కావడంతో వైకాపా శ్రేణుల్లో కలకలం రేగింది. కానీ కొద్దిసేపటికే ఫనీంద్ర తాను షేర్ చేసిన వీడియోను డిలీట్ చేశాడు. కానీ అప్పటికే ఈ వీడియో వైరల్ కావడంతో ఫనీంద్ర వివరణ ఇచ్చాడు.
తన ఫోనును హ్యాక్ చేశారని.. ఈ వీడియో తాను షేర్ చేయలేదని తెలిపాడు. ఫోన్ హ్యాక్ అయినా మరో మహిళతో వున్న రాసలీలల వీడియోను ఎందుకు తీసుకున్నాడని.. నెటిజన్లు విమర్శిస్తున్నారు.