సంబంధిత వార్తలు
- ది లీడర్ : మహిళా బెగ్గర్‌కు అంత్యక్రియలు నిర్వహించిన ఎమ్మెల్యే...
- ఎన్నికల్లో విచిత్ర పరిస్థితి : కలిసి పోటీ చేస్తున్న టీడీపీ - వైకాపా
- ఈసారి కొండగల్ నుంచి రేవంత్ రెడ్డి పారిపోయేట్లున్నారు...
- వైసిపి నాయకులకు ఏమైంది? ఒకరేమో బూతులు.. మరొకరేమో వార్నింగ్‌లు..
- ఆ ఇద్దరూ మోసగాళ్లే.. కాపుల్ని ముంచారు.. కేవలం ఓటు బ్యాంకుగానే?: సత్యనారాయణ
కులపిచ్చి ప్రొఫెసర్ల వేధింపుల వల్లే డాక్టర్ శిల్ప సూసైడ్ : ఎమ్మెల్యే రోజా
ఆ కులపిచ్చి ప్రొఫెసర్ల వేధింపుల వల్లే ప్రభుత్వ డాక్టర్ శిల్ప ఆత్మహత్య చేసుకుందని వైకాపా ఎమ్మెల్యే ఆర్కే.రోజా ఆరోపించారు. ఫ్రొఫెసర్ల లైంగిక వేధింపుల కారణంగా పీలేరుకు చెందిన ఆత్మహత్యకు పాల్పడిన విషయం త
ఆ కులపిచ్చి ప్రొఫెసర్ల వేధింపుల వల్లే ప్రభుత్వ డాక్టర్ శిల్ప ఆత్మహత్య చేసుకుందని వైకాపా ఎమ్మెల్యే ఆర్కే.రోజా ఆరోపించారు. ఫ్రొఫెసర్ల లైంగిక వేధింపుల కారణంగా పీలేరుకు చెందిన ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. దీనిపై ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ, ఈ అమ్మాయి కూడా కులపిచ్చి రాక్షసుల వల్లే చనిపోయిందన్న విషయం స్పష్టంగా అర్థమౌతోందన్నారు.
గవర్నర్ కు ఫిర్యాదు చేసినా ఓ మహిళకు రక్షణ లేకపోవడం దారుణమని.. పరిపాలనా లోపమని అన్నారు. ఆ అమ్మాయి ఫిర్యాదు చేసిన తర్వాత విచారణ చేసి నిందితులను శిక్షించి ఉంటే శిల్పకు ఈ పరిస్థితి వచ్చేది కాదని అన్నారు.
పాఠాలు బోధించాల్సిన గురువులే డాక్టర్ శిల్పపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని ఏపీ ప్రభుత్వానికి ఎన్ని లేఖలు రాసినా ప్రయోజం లేకుండా పోయిందని ఫలితంగా ఓ నిండు ప్రాణం బలైందన్నారు.
ఈ కేసు విచారణ నిమిత్తం ఏర్పాటు చేసిన హైలెవెల్ కమిటీలో సభ్యులు ఈ జిల్లాకు చెందిన వారే ఉంటారని, వాళ్లందరూ ఈ ప్రభుత్వ కనుసన్నల్లోనే నడుస్తారని ఆరోపించారు. చంద్రబాబు పరిపాలనలో మహిళల అక్రమ రవాణా, వేధింపులు, ఆత్మహత్యలలో ఆంధ్రప్రదేశ్ నంబర్‌గా ఉందన్నారు.
