1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
  4. Daily Horoscope dated 20-01-2021

20-01-2121 బుధవారం రాశిఫలాలు - సత్యదేవుని పూజించినా అరించినా...

Daily Horoscope
మేషం : శ్రీవారు, శ్రీమతి వైఖరిలో మార్పు గమనిస్తారు. ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాలకు అనుకూలం. మీ నూతన పథకాలను క్రియా రూపంలో పెట్టి జయం పొందండి. గృహమునకు కావలసిన వస్తువులను సమకూర్చుకుంటారు. మీ మిత్రుల కోసం బంధువుల కోసం అదనపు బరువు బాధ్యతలు స్వీకరిస్తారు. 
 
వృషభం : వృత్తి వ్యాపారాల్లో వ్యూహాత్మకంగా వ్యవహరించి సత్ఫలితాలు సాధిస్తారు. మీ మనోభావాలు బయటకి వ్యక్తం చేసి సమస్యలు తీర్చుకోగలుగుతారు. భాగస్వామ్యుల మధ్య ఆసక్తికరమైన విషయాలు చర్చకు వస్తాయి. స్త్రీలు కళాత్మక పోటీల పట్ల ఆసక్తి చూపిస్తారు. ఉద్యోగస్తులకు బరువు బాధ్యతలు అధికమవుతాయి. 
 
మిథునం : కుటుంబ విషయంలో కూడా మీకు సానుకూల వాతావరణం నెలకొనివుంటుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. రచయితలు, పత్రికా రంగంలోని వారికి, కళారంగంలోని వారికి ప్రోత్సాహం లభిస్తుంది. అనవసర విషయాలలో తలదూర్చి సమస్యలు తెచ్చుకోకండి. సామూహిక దైవ కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. 
 
కర్కాటకం : బంధువుల రాక సంతోషాన్ని కలిగిస్తుంది. భార్యాభర్తల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. విలువైన కానుకలు అందించి ప్రముఖులను ప్రసన్నం చేసుకుంటారు. చేపట్టిన పనులు కొంత ఆలస్యంగా అయినా సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. రుణ విముక్తులు కావడంతో మానసికంగా కుదుటపడతారు. 
 
సింహం : ఒక కార్య సాధన కోసం ఒకటికి పదిసార్లు ఆలోచించవలసి ఉంటుంది. నిరుద్యోగులకు లభించిన అవకాశం తాత్కాలికమే అయినా సద్వినియోగం చేసుకోవడం మంచిది. మీ అభిరుచి ఆశాయలకు తగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. స్త్రీలకు నడుము, నరాలు, ఎముకలకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి.
 
కన్య : ఏదైనా అమ్మకానికి చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం విషయంలో మెళకువ వహించండి. అందరి సహాయ, సహకారాలు అందుకుంటూ ప్రశాంతంగా గడుపుతారు. ఓర్పు, సర్దుబాటు ధోరణితో వ్యవహరించడం వల్ల సమస్య పరిష్కారమవుతుంది. మీ సంతానం విపరీత ధోరణి వల్ల అసహనానికి లోనవుతారు. 
 
తుల : మీ భవిష్యత్తుకు ఉపయోగపడేటువంటి స్నేహితులు మీకు కొత్తగా పరిచయమవుతారు. స్త్రీల బంధువులలో సఖ్యత నెలకొంటుంది. మీ ఉన్నతిని చాటుకోవడం కోసం ధనం విరివిగా ఖర్చు చేస్తారు. వ్యాపార అభివృద్ధికి చేసే కృషి ఫలిస్తుంది. బంధువుల రాకతో కొంత అసౌకర్యానికి లోనవుతారు. 
 
వృశ్చికం : తోటి ఉద్యోగుల మీద ఆధారపడి ఏ కార్యము చేయవద్దు. నిర్మాణ పనులలో కాంట్రాక్టర్లకు బిల్డర్లకు ఏకాగ్రత చాలా అవసరం. దంపతుల మధ్య చిరు కలహాలు తప్పవు. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలలో ధనం అధికంగా వ్యయం చేస్తారు. రావలసిన ధనం రావడంతో పాటు ఖర్చులు కూడా అధికమవుతాయి. 
 
ధనస్సు : ప్రేమికుల తొందరపాటుతనం సమస్యలకు దారితీస్తుంది. కోర్టు వ్యవహారాలలో సానుకూలత తక్కువ. ఆలయాలను సందర్శిస్తారు. అందువల్ల వాయిదాలు తీసుకోవడం మంచిది. స్త్రీలు అపరిచిత వ్యక్తులకు దూరంగా ఉండటం క్షేమదాయకం. తరచూ ఉద్యోగ, వ్యాపార విషయాలలో ప్రయాణం చేయవలసి వస్తుంది. 
 
మకరం : వస్త్ర, బంగారు, వెండి, లోహ వ్యాపారస్తులకు అధిక ఒత్తిడిని, ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఉద్యోగంలో కొత్త ప్రయోగాలకు అనుకూలమైన కాలం. వ్యాపార విషయంగా ఓర్పు, నేర్పు చాలా అవసరం. పంతాలు పట్టింపులకు ఇది సమయం కాదు. వైద్యులకు ఆపరేషన్లు చేయునపుడు ఏకాగ్రత్త చాలా అవసరం. 
 
కుంభం : విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో ఉన్నవారికి అనుకూలమైన కాలం. పాత మిత్రుల కలయికతో గత విషయాలు జ్ఞప్తికి వస్తాయి. వ్యాపారాల్లో పెరిగిన పోటీ ఆందోళన కలిగిస్తుంది. మీ ప్రమేయ లేకుండానే కొన్ని చిక్కులు పరిష్కారమవుతాయి. సంఘంలో మీ మాటపై నమ్మకం, గౌరవం పెరుగుతుంది. 
 
మీనం : ట్రాన్స్‌పోర్టు, ఆటోమొబైల్, మెకానికల్ రంగాల వారికి ఒత్తిడి అధికమవుతుంది. మీ యత్నాలకు ప్రముఖుల నుంచి సహాయ సహకారాలు అందిస్తారు. ఆలయాలను సందర్శిస్తారు. గృహోపకరణాలు, వాహనం కొనుగోలు చేస్తారు. ఇతరాత్రా వ్యాపకాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ప్రేమికులకు ఊహించని చికాకులు అధికమవుతాయి. 
About Writer
రామన్
తర్వాతి కథనం
21-01-2021 గురువారం దినఫలాలు - బాబా ఆలయంలో అన్నదానం చేస్తే...