16-01-2021 శనివారం మీ రాశి ఫలితాలు.. శ్రీ వేంకటేశ్వర స్వామిని..?

venkateswara swamy
venkateswara swamy

శనివారం శ్రీ వేంకటేశ్వర స్వామిని ఆరాధించినట్లైతే సర్వదా శుభం కలుగుతుంది. 
 
మేషం: వస్త్ర, ఫ్యాన్సీ, పచారీ, మందులు, రసాయన సుగంధ ద్రవ్య వ్యాపారులకు పురోభివృద్ధి. పాత బాకీలు వసూలు చేయడం వల్ల ఆర్థిక ఇబ్బంది తొలగిపోతుంది. ఉద్యోగస్తులకు అడ్వాన్సులు, మెడికల్ క్లయింలు మంజూరవుతాయి. ఒక్కోసారి మీ జీవిత భాగస్వామి మనస్తత్వం అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. 
 
వృషభం: ఆర్థిక లావాదేవీల్లో ఏకాగ్రత వహించండి. స్త్రీలకు చుట్టుపక్కల వారి నుంచి కొత్త సమాచారం అందుతుంది. పత్రిక, ప్రైవేట్ సంస్థల్లోని వారు ఓర్పు, అంకితభావంతో పనిచేయాల్సి వుంటుంది. రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్లు అనుకూలించవు. గృహ నిర్మాణాలు, మరమ్మతులు మందకొడిగా సాగుతాయి. 
 
మిథునం: ఒక వ్యవహారం నిమిత్తం ఆకస్మికంగా ప్రయాణం చేస్తారు. తీర్థయాత్రలు, నూతన ప్రదేశ సందర్శనల పట్ల ఆసక్తి కలుగుతుంది. సిమెంట్, కలప, ఐరన్, ఇటుక వ్యాపారులకు మిశ్రమ ఫలితం. చెల్లింపులు, బ్యాంకు వ్యవహారాల్లో ఏకాగ్రత అవసరం. పెద్దల గురించి అప్రియమైన వార్తలు వింటారు. 
 
కర్కాటకం: ఉద్యోగస్తులు విమర్శలను ఎదుర్కొంటారు. కుటుంబీకుల కోసం ధనం విరివిగా వ్యయం చేయాల్సి వుంటుంది. అవమానాలను ఎదుర్కొంటారు. దంపతుల మధ్య కలహాలు తొలగి ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. స్త్రీలకు ప్రకటనలు, స్కీమ్‌ల పట్ల ఆసక్తి పెరుగుతుంది. విద్యార్థినులకు ప్రేమ వ్యవహారాల్లో చుక్కెదురవుతుంది. 
 
సింహం: ఓర్పు, శ్రమాధిక్యతతో చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. నూతన కాంట్రాక్టులు, లీజు, ఏజెన్సీలకు సంబంధించిన వ్యవహారాలు సానుకూలమవుతాయి. కోర్టు వ్యవహారాలు వాయిదా పడటం మంచిది. మీ సంతానం భవిష్యత్తు కోసం కొత్త ప్రణాళికలు రూపొందిస్తారు. నిరుద్యోగులకు కొత్త కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. 
 
కన్య: ప్రింటింగ్ రంగాల వారికి మందకొడిగా ఉంటుంది. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి వృత్తి వ్యాపారాల్లో మెరుగైన ఫలితాలు సాధిస్తారు. దూర ప్రయాణాల్లో ఊహించని చికాకులు ఎదురవుతాయి. ద్విచక్ర వాహనాలపై దూర ప్రయాణాలు ఇబ్బందులకు దారితీస్తాయి. మీలో నెలకొన్న అశాంతి, చికాకులు తొలగిపోతాయి. 
 
తుల: వ్యాపారాల్లో లాభనష్టాలను సమీక్షించుకుంటారు. ప్రయాణాల్లో చికాకులు తప్పవు. ఆదాయానికి మించిన ఖర్చులు, విద్యుత్ బిల్లులు, పెరిగిన ధరలు ఆందోళన కలిగిస్తాయి. పనుల సానుకూలతకు బాగా శ్రమించాలి. ప్రేమికులకు ఎడబాటు, చికాకులు తప్పవు. స్త్రీలు రచనలు, కళాత్మక పోటీల్లో రాణిస్తారు. 
 
వృశ్చికం: ఉద్యోగస్తులకు అధికారులతో సాన్నిత్యం బలపడుతుంది. వాణిజ్య ఒప్పందాలు, స్థిరాస్క్రయ విక్రయాలకు అనుకూలం. ఒక నష్టం మరో విధంగా సర్దుబాటు కాగలదు. విదేశాల్లోని ఆత్మీయుల క్షేమ సమాచారం ఆందోళన కలిగిస్తుంది. ఆలయాలను సందర్శిస్తారు. చేపట్టిన పనుల్లో ఒత్తిడి, ఆటంకాలు ఎదుర్కొంటారు.
 
ధనస్సు: ఆదాయ వ్యయాల్లో ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. దీర్ఘకాలికంగా వాయిదా పడుతూ వస్తున్న పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు సదవకాశాలు లభిస్తాయి. సంతానం భవిష్యత్తు కోసం పొదుపు పథకాలు చేపడతారు. కుటుంబ సభ్యులతో సంప్రదించి నిర్ణయం తీసుకోవాలి. విద్యార్థులకు అత్యుత్సాహం తగదు. 
 
మకరం: అవగాహన లేని వ్యాపారాలు, వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. రాబడికి మించి ఖర్చులు ఉంటాయి. ప్రైవేట్ ఫైనాన్స్‌లో పొదుపు, వ్యక్తులకు రుణాలు క్షేమం కాదు. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తి మరింత బలపడుతుంది. ఆసక్తి మరింత బలపడుతుంది. ఉపాధ్యాయులకు ఒత్తిడి అధికమవుతుంది. పెద్దలను, ప్రముఖులను కలుసుకుంటారు. 
 
కుంభం: ఉద్యోగస్తులకు తోటివారితో సమన్వయం లోపిస్తుంది. కోర్టు వ్యవహారాలు వాయిదా పడతాయి. జీవిత భాగస్వామి ఆరోగ్యంలో జాగ్రత్త అవసరం. శత్రువులు మిత్రులుగా మారతారు. కాంట్రాక్టర్లకు, బిల్డర్లకు నిర్మాణ పనుల్లో ఏకాగ్రత చాలా అవసరం. పత్రికా సిబ్బందికి ఒత్తిడి, పనిభారం అధికం. రుణం కోసం అన్వేషిస్తారు. 
 
మీనం: ఆదాయ వ్యయాలకు బడ్జెట్ రూపొందించుకుంటారు. బెట్టింగ్‌లు, జూదాల వల్ల నష్టపోయే ఆస్కారం వుంది. రియల్ ఎస్టేట్ రంగాల వారికి అభ్యంతరాలెదుర్కోవలసి వస్తుంది. విద్యార్థులకు ఉపాధ్యాయులతో సాన్నిత్యం నెలకొంటుంది. బంధువులతో పట్టింపులు వీడి సంబంధాలు పెంచుకుంటారు. 


வெப்துனியா செய்திகள் உடனுக்குடன்!!! உங்கள் மொபைலில்... இங்கே க்ளிக் செய்யவும்
దీనిపై మరింత చదవండి :